పార్లమెంట్ ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు(Ap politics) కీలక మలుపులు తిరుగుతున్నాయి. మొన్నటివరకు టీడీపీ(TDP), అధికార వైసీపీ(YCP) మధ్య మాటల యుద్ధం తీవ్రతరం కాగా, తాజాగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తన సోదరుడు, సీఎం జగన్(Cm jagan) మీద విమర్శనాస్త్రాలను సంధిస్తోంది. ఒక్క చాన్స్ పేరుతో ఏపీ ప్రజలను జగన్ మోసం చేశారని ఆమె ఎద్దేవాచేశారు.
ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మే 13న నాలుగో దశలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల ఆశీర్వాదం కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు పోటీ పడి మరీ ప్రచారం చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల వైసీపీ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక్క చాన్స్ అంటూ సీఎం జగన్ ఏపీ ప్రజలను మోసం చేశాడన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె విజయవాడ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.
గత ప్రభుత్వాలు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాయని విమర్శించారు.ఏపీలో రాజధాని ఎక్కడో చెప్పుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నారని, రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. ఒక్క చాన్స్ ఇస్తే అమెరికాలోని వాషింగ్టన్ డీసీని మించిన రాజధానిని చేస్తానని చెప్పిన జగన్.. గెలిచాక అసలు రాజధానే లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలన్నారు.