తెలంగాణ (Telangana)లో ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukendhar Reddy). డిసెంబర్ లోగా ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. జమిలి ఎన్నికల (Jamili Elections) పేరుతో కేంద్రం కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై ఇంకా ఏమన్నారంటే…
కేంద్రం చేస్తున్న హడావిడితో దేశవ్యాప్తంగా ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సజావుగా సాగించే పరిస్థితి లేదు. అన్ని మార్గాలను ఉపయోగించి తిరిగి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోంది. జనవరి 16 లోపు తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, మూడోసారి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది.
ప్రతిపక్ష పార్టీలపై కూడా గుత్తా విమర్శలు చేశారు.
వైఎస్ షర్మిల లాంటి సమైక్యవాదులు రాష్ట్రంలో చొరబడ్డారని చెప్పారు. తెలంగాణా వ్యతిరేకులంతా ఏకమవుతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలకు స్వప్రయోజనాలే ముఖ్యమని.. నల్లగొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జానారెడ్డి లవి ముగ్గురివి మూడు దారులని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి సగం శరీరం బీజేపీలోనే ఉందని సెటైర్లు వేశారు.