Telugu News » యూపీలో లవ్ జిహాద్ కేసు… హిందువుగా చెప్పుకుంటూ దళిత మహిళను ట్రాప్ చేసి….!

యూపీలో లవ్ జిహాద్ కేసు… హిందువుగా చెప్పుకుంటూ దళిత మహిళను ట్రాప్ చేసి….!

దళిత మహిళను వివాహం చేసుకుని ఇస్లాంలోకి మారాలంటూ ఆమెపై ఇబ్రహీం ఒత్తిడి తెచ్చాడు

by Ramu
Dalit Hindu woman lured into marriage by Daud Ibrahim posing as Rahul Gupta

యూపీలో లవ్ జిహాద్ కేసు నమోదైంది. హిందూ మతస్తునిగా చెప్పుకుంటూ దళిత హిందూ మహిళను ఓ వ్యక్తి ట్రాప్ చేశాడు. అనంతరం ఆ మహిళను వివాహం చేసుకుని ఇస్లాంలోకి మారాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. తన ఇంటికి తీసుకు వెళ్లి చిత్ర హింసలకు గురి చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం….

Dalit Hindu woman lured into marriage by Daud Ibrahim posing as Rahul Gupta

అంబేడ్కర్ నగర్ జిల్లాలోని అక్బర్ పోలీసు స్టేషన్ పరిధిలో బాధితురాలు తన మొదటి భర్తతో కలిసి నివాసం ఉండేది. మూడేండ్ల క్రితం దావూద్ ఇబ్రహీం అనే వ్యక్తి రాహుల్ గుప్తా అనే పేరుతో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. కొన్ని నెలల్లోనే పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆమె తన భర్తను వదిలి ఇబ్రహీం వెంట వెళ్లి పోయింది.

ఆ తర్వాత కొంత కాలం పాటు వాళ్లిద్దరూ సహజీవనం చేశారు. ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలని ఇబ్రహీంపై ఆమె ఒత్తిడి తేవడం మొదలు పెట్టింది. కానీ ఇబ్రహీం ప్రతి సారీ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆమె బలవంతం మీద ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఓ అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. అనంతరం వాళ్లకు ఓ పాప పుట్టింది.

కానీ వివాహం జరిగిన అన్ని నెలలు గడుస్తున్నా ఇబ్రహీం తరఫు బంధువులు ఎవరూ రాకపోవడంతో ఆమెకు అనుమానం మొదలైంది. గతేడాది నవంబర్ నుంచి ఇబ్రహీం వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. మీర్జాపూర్ లోని తన ఇంటికి ఆమెను ఇబ్రహీం తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమెకు అసలు విషయం తెలిసింది. అక్కడి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.

ఆమెను ఇస్లాంలోకి మారాలంటూ ఇబ్రహీం కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చేవారు. ఇస్లాం సాంప్రదాయాలు పాటించాలని ఆమెను వేధించే వాళ్లు. దీంతో ఎలాగోలా అక్కడి నుంచి ఆమె బయటపడి పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇబ్రహీంతో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

You may also like

Leave a Comment