Telugu News » Revanth Reddy: విద్యను ప్రైవేట్ పరం చేయాలని కేసీఆర్‌ చూస్తున్నాడు: రేవంత్‌ రెడ్డి!

Revanth Reddy: విద్యను ప్రైవేట్ పరం చేయాలని కేసీఆర్‌ చూస్తున్నాడు: రేవంత్‌ రెడ్డి!

పల్లా రాజేశ్వర్ రెడ్డికి బంట్రోతుగా మారిన వ్యక్తి కేయూ వీసీగా పనిచేస్తున్నారు.

by Sai
cm-kcr-aim-is-to-privatize-education-revanth-reddy

కాకతీయ యూనివర్సిటీ‌లో(Ku) తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy)పర్యటించారు. పీహెచ్‌డీ కేటగిరి 2 అడ్మిషన్లలో జరిగిన అవకతవకలపై దీక్ష చేస్తున్న విద్యార్థులకు రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. పోలీసుల దాడిలో గాయపడిన కేయూ విద్యార్థులను రేవంత్ పరామర్శించారు.”అర్హతలేని వారికి, బీఆర్ఎస్ జెండా మోసిన వారికి PHD అడ్మిషన్లు ఇచ్చారు. అర్హులకు అన్యాయం చేశారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాడారు.

cm-kcr-aim-is-to-privatize-education-revanth-reddy

అక్రమాలలో వీసీ, రిజిస్ట్రార్ కు భాగస్వామ్యం ఉంది. పల్లా రాజేశ్వర్ రెడ్డికి బంట్రోతుగా మారిన వ్యక్తి కేయూ వీసీగా పనిచేస్తున్నారు. యూనివర్సిటీ భూములను కబ్జా చేస్తే అడిగే నాథుడు లేడు. పోరాడిన విద్యార్థులపై టాస్క్ ఫోర్స్ పోలీసులతో దాడి చేయించారు. వీధిరౌడీల్లా విద్యార్థుల కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. కేయూ వీసీని బర్తరఫ్ చేయాలి.

కేసీఆర్ దొరపోకడలను ప్రశ్నిస్తున్నారని యూనివర్సిటీలను కాలగర్భంలో కలిపేయాలనుకుంటున్నారా..?. కాకతీయ యూనివర్సిటీలో గొడవలకు కారణం పల్లా రాజేశ్వర్రెడ్డే. పల్లా యూనివర్సిటీని కాపాడుకోవాలని కేయూను నిర్వీర్యం చేస్తున్నారు. కేయూ విద్యార్థులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే PHD అడ్మిషన్ల అవకతవకలపై విచారణ జరిపిస్తాం. విద్యార్థులను కొట్టే హక్కు పోలీసులకు ఎక్కడిది.

కేసీఆర్ కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. PHD అక్రమ అడ్మిష‌న్లను రద్దు చేయాలి. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఈప్రాంతం వాడు కాదు. సీపీ రంగనాథ్ కుర్చీవేసుకుని కూర్చొని విద్యార్థులను కొట్టించారని విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పటికైనా నిస్పక్షపాతంగా విచారణ జరపండి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులను ఆదుకుంటాం.

విద్యను ప్రైవేట్ పరం చేయడమే కేసీఆర్ లక్ష్యం. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారు. దీక్షల ద్వారా సమస్యలు పరిష్కారం కావు… ప్రభుత్వం మారితేనే సమస్య పరిష్కారం అవుతుంది.” అని రేవంత్ రెడ్డి అన్నారు.

You may also like

Leave a Comment