Telugu News » Liquor Scam :కవిత ఈడీ విచారణ.. లిక్కర్ స్కాం ఎలా బయటకొచ్చింది..? ఇప్పటిదాకా ఏం జరిగింది?

Liquor Scam :కవిత ఈడీ విచారణ.. లిక్కర్ స్కాం ఎలా బయటకొచ్చింది..? ఇప్పటిదాకా ఏం జరిగింది?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం పంపింది ఈడీ. మరోసారి విచారణకు రావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అసలీ లిక్కర్ స్కాం ఏంటి..? ఇప్పటిదాకా ఏం జరిగిందో చూద్దాం.

by admin
Delhi-Liquor-Scam

ఢిల్లీ లిక్కర్ స్కాం (Liquor Scam) కేసు మూలన పడిందనే విమర్శలు వస్తున్న సమయంలో ఈడీ (ED) మళ్లీ దూకుడు పెంచింది. ఈమధ్యే అరుణ్ పిళ్లై అప్రూవర్ గా మారడంతో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) కు ఆహ్వానం పంపింది. మరోసారి విచారణకు రావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అసలీ లిక్కర్ స్కాం ఏంటి..? ఇప్పటిదాకా ఏం జరిగిందో చూద్దాం.

Delhi-Liquor-Scam

ఢిల్లీ లిక్కర్ పాలసీ

– ఢిల్లీలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దుకాణాలను ప్రైవేట్ కు అప్పగిస్తూ 2020 సెప్టెంబర్‌ లో ఆప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
– 2021 జనవరి 5న లిక్కర్‌ పాలసీ రూపకల్పనకు కమిటీ ఏర్పాటు
– డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాశ్ గెహ్లాట్‌ తో కలిసి కమిటీ
– రెండు నెలల తర్వాత కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పన. 2021 మే 21 ఎలాంటి సవరణలు లేకుండానే కేబినెట్ ఆమోదం.
– లిక్కర్ పాలసీలో విదేశీ మద్యం ధరలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా అభ్యంతరం

ఈడీ, సీబీఐ ఎంట్రీ

– ఎల్జీ వ్యాఖ్యల్ని పట్టించుకోకుండా ఆప్ ప్రభుత్వం పాలసీ ఆమోదించడంతో మొదలైన వివాదం
– 2022 జులై 20న కేంద్ర హోంశాఖకు వినయ్ కుమార్ సక్సేనా లేఖ.
– జులై 22న సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు.
– ఆగస్టు 19న 15 మంది పేర్లతో ఎఫ్​ఐఆర్ నమోదు. అదే రోజు డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు 25 చోట్ల సోదాలు.
– భారీ ఎత్తున డబ్బు చేతులు మారాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు 22న ఈడీ ఎంట్రీ.

హైదరాబాద్ లో మొదటిసారి ఈడీ సోదాలు

– 2022 సెప్టెంబర్ 6న హైదరాబాద్‌ లో అరుణ్ రామచంద్ర పిళ్లైకు చెందిన రాబిన్ డిస్టలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీలు.. నివాసంలో ఈడీ సోదాలు
– సెప్టెంబర్ 17న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు ఇల్లు, ఆఫీసులో తనిఖీలు
– సెప్టెంబర్ 22న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం
– అక్టోబర్ 7న ముత్తా గౌతమ్‌ విచారణ, సోదాలు
– అక్టోబర్ 10న లిక్కర్ స్కాంలో సంబంధాలున్నాయని బోయినపల్లి అభిషేక్‌ ను అదుపులోనికి తీసుకున్న సీబీఐ. అదే రోజు అరెస్ట్ చేసిన్నట్లు ప్రకటన
– అక్టోబరు 17న డిప్యూటీ సీఎం సిసోడియాను ప్రశ్నించిన సీబీఐ అధికారులు

మొదటి ఛార్జిషీట్

– 2022 నవంబర్ 25న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో తొలి చార్జిషీట్‌. మొత్తం10 వేల పేజీలతో సమర్పించిన సీబీఐ
– నవంబరు 26న లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ ఉల్లంఘనల ఆరోపణలపై ఈడీ మొదటి చార్జిషీట్‌
– నవంబరు 29న సౌత్ గ్రూప్ కీలక పాత్ర పోషించినట్లు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఈడీ

తెరపైకి కవిత పేరు.. సీబీఐ, ఈడీ విచారణ

– 2022 నవంబర్ 29న తొలిసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావన. రెండు వేర్వేరు నెంబర్లతో కవిత మొత్తం పది మొబైల్ ఫోన్లను మార్చారని, ఆధారాలు ధ్వంసం చేశారని ఆరోపణలు
– డిసెంబరు 6న విచారణకు రావాలని కవితకు సీబీఐ నోటీసులు
– డిసెంబరు 11న సీబీఐ విచారణకు హాజరుకాని కవిత.. అదే రోజున సీఆర్పీ 191 కింద మరోసారి నోటీసుల జారీ
– డిసెంబర్ 11న ఉదయం నుంచి సాయంత్రం వరకు కవిత నివాసంలోనే 6 గంటలపాటు సీబీఐ విచారణ
– 2023 మార్చి 11న తొలిసారి కవితను విచారించిన ఈడీ
– మార్చి 16న ఈడీ విచారణకు కవిత డుమ్మా
– మార్చి 20 ఈడీ విచారణకు మరోసారి కవిత హాజరు
– మార్చి 21న వరుసగా రెండోరోజు కవిత విచారణ
– మార్చి 24న అధికారులు రూల్స్ పాటించడం లేదని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్
– సెప్టెంబర్ 15న విచారణకు 14న నోటీసులు పంపిన ఈడీ

ఎవరెవరు ఎప్పుడు అరెస్ట్ అయ్యారంటే?

సెప్టెంబర్ 28- సమీర్ మహేంద్రు
నవంబర్ 11- శరత్ చంద్రారెడ్డి
నవంబర్ 11- బినొయ్ బాబు
నవంబర్ 13- అభిషేక్ బోయినపల్లి
నవంబర్ 13- విజయ్ నాయర్
నవంబర్ 29- అమిత్ అరోరా
ఫిబ్రవరి 8- గౌతమ్ మల్హోత్రా
ఫిబ్రవరి 9- రాజేష్ జోషి
ఫిబ్రవరి 11- మాగుంట రాఘవ
మార్చి 2- అమన్ దీప్ దల్ సింగ్
మార్చి 6- అరుణ్ రామచంద్ర పిళ్ళై

You may also like

Leave a Comment