Telugu News » Step to Bollywood : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సాయిపల్లవి ..!?

Step to Bollywood : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సాయిపల్లవి ..!?

సాయిపల్లవి (Sai Pallavi)...తనదైన యాక్టింగ్ స్కిల్ తో,సూపర్ స్టాండెడ్ డ్యాన్స్ తో సౌత్ సినిమాలో ఒక స్ట్రాంగ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నతమిళ అమ్మాయి. ఫిదా సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

by sai krishna

సాయిపల్లవి (Sai Pallavi)…తనదైన యాక్టింగ్ స్కిల్ తో,సూపర్ స్టాండెడ్ డ్యాన్స్ తో సౌత్ సినిమాలో ఒక స్ట్రాంగ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నతమిళ అమ్మాయి. ఫిదా సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే గత కొద్ది రోజులుగా సాయిపల్లవి సినిమాలకు దూరమైంది. దీంతో పల్లవి పెళ్లి చేసుకోబోతుందని, హాస్పిటల్ పెడుతుందని, సినిమాలకు గుడ్ బై చెప్పి డాక్టర్ గానే కొనసాగుతుందని వార్తలు వచ్చాయి.


ఇక అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. పాత్ర నచ్చకపోతే..అది ఏస్థాయి సినిమానైనా రిజెక్ట్ చేస్తుంది.ఈ కారణంతోనే భోళా శంకర్(Bhola Shankar), చంద్రముఖి-2(Chandramukhi 2)సినిమాలను కూడా ఆమె రిజెక్ట్ చేసిందని టాక్. ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది.

అది కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan)హీరోగా సినీలెజెండ్ కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు. ఇక తాజాగా సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు గుప్పుమంటున్నాయి.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్(Aamir Khan) తనయుడు జునైద్ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ లో హిట్ అందుకున్న లవ్ టుడే సినిమాను బాలీవుడ్ లో జునైద్ రీమేక్ చేస్తున్నాడు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నఈ సినిమా తరువాత జునైద్ మరో కొత్త మూవీ ప్లాన్ చేస్తున్నాడు.ఆ మూవీకి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్నఈ చిత్రంలో జునైద్ సరసన సాయిపల్లవి అయితే బావుంటుందని మేకర్స్ భావించి ఆమెను సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది.

అయితే ఈ సినిమాకు సాయిపల్లవి ఓకే చెప్పిందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక అభిమానులు అయితే..బాలీవుడ్ కు సాయిపల్లవి నో నే చెప్తుంది అని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

You may also like

Leave a Comment