130 ఏండ్ల కాంగ్రెస్(Congress) చరిత్రలో మొదటి సారి(first time) సీడబ్ల్యూసీ సమావేశాలు(cwc meetings) హైదరాబాద్ లో జరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా సెప్టెంబర్ 17 న సభను నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.
సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గే లు రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఓపీఎస్ తిసుకోచ్చారని గుర్తు చేశారు. కర్ణాటకలో 100 రోజుల్లోపు 4 గ్యారంటీ స్కిమ్స్ అమలు చేశామన్నారు. ఈ సభలో సోనియా గాంధీ 5 గ్యారంటీ స్కిమ్స్ విడుదల చేస్తారని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధికంగా కాంగ్రెస్ సభ్యత్వాలను నల్గొండ పార్లమెంట్ నమోదు చేసిందన్నారు.
ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలన్నారు. తుక్కుగూడ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. తాను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. ఈసారి 70 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. తాను రాజకీయ అనుభవంతో ఈ మాటలు చెబుతున్నానన్నారు.
ఇది ఇలా వుంటే ఈ రోజు సమావేశంలో బోయిన్ పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో విడుదల చేసిన ఛార్జ్ షీట్ తో పాటు ఇతర అంశాలను చర్చించామన్నారు. నియోజక వర్గాల వారీగా మిని ఛార్జ్‌షీట్ ను కూడా విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్ మెనిఫెస్టో ద్వారా ఇచ్చిన హామీల కన్నా తొమ్మిది ఏండ్ల బీఆర్ఎస్ అసమర్థ పాలనను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు.