Telugu News » Tamilanadu: అక్కడ మహిళా పూజారులు!

Tamilanadu: అక్కడ మహిళా పూజారులు!

శిక్షణ పూర్తి చేసిన మహిళలు 20 నుండి 30 ఏళ్ల వయసు వారే. వీరిలో ఎన్ రంజిత, ఎస్ రమ్య, సి కృష్ణవేణిలు శిక్షణ తీసుకుని గుడిలోకి అర్చకులుగా అడుగుపెట్టబోతున్నారు.

by Prasanna
tamilanadu

దేవాలయాల్లో అర్చకులు, పూజారులు (Preist) ఎక్కువగా మగవారే ఉంటారు. అయితే ఈ రంగంలో ఆడవారికి కూడా అవకాశం కల్పిస్తోంది తమిళనాడు (Tamilnadu) రాష్ట్ర ప్రభుత్వం. భగవంతుడికి సేవ చేసుకువాలని ఉన్నా మగవారికి ప్రాధాన్యత ఎక్కువగా ఉండటంతో మహిళలు (Women) ఈ రంగంలోకి రావడానికి వెనకడుగు వేసేవారు. తమిళనాడులో ఇప్పుడు ముగ్గురు మహిళలు అర్చకత్వాన్ని చేపట్టనున్నారు.

tamilanadu

మహిళలు అర్చకత్వంలోకి అడుగుపెట్టేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకమైన శిక్షణనిస్తోడటం విశేషం. తాజాగా అర్చకత్వం శిక్షణ పూర్తి చేసిన మహిళలు 20 నుండి 30 ఏళ్ల వయసు వారే. వీరిలో ఎన్ రంజిత, ఎస్ రమ్య, సి కృష్ణవేణిలు శిక్షణ తీసుకుని గుడిలోకి అర్చకులుగా అడుగుపెట్టబోతున్నారు.

తమిళనాడు రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు చెందిన అర్చకులు కావొచ్చునన్న పథకాన్ని స్టాలిన్ ప్రభుత్వం తీసుకువచ్చింది. అలాగే అందుకు తగ్గ శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ఆశావాహులైన మహిళలను ఆహ్వానించింది. తాజాగా ముగ్గురు నారీమణులు అర్చకత్వ శిక్షణ పూర్తి చేశారు. వీరికి మానవ వనరుల శాఖ మంత్రి సర్టిఫికేట్ అందించారు. ఈ ముగ్గురిని సీఎం స్టాలిన్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా అభినందించారు.

‘పైలట్లు, ఆస్ట్రోనాట్స్ గా మహిళలు దూసుకెళుతున్నప్పటికీ, దేవతలు పూజించబడే దేవాలయాల్లో వారిని అపవిత్రులుగా భావిస్తూ…అర్చకత్వానికి అనర్హులుగా పేర్కొంటూ అతివలను నిరోధిస్తున్నారు. ఎట్టకేలకు మార్పు సంతరించుకుంది. తమిళనాడులో ద్రావిడ మోడల్ ప్రభుత్వం.. అన్ని కులాల వారిని పూజారులుగా నియమించడం ద్వారా పెరియార్ భావాలను సాధించాం, మహిళలు గర్బగుడిలోకి  ప్రవేశిస్తున్నారు. సమగ్రత, సమానత్వం కొత్త శకానికి తీసుకువస్తుంది’ అని స్టాలిన్ ట్వీట్ (ఎక్స్) చేశారు.

You may also like

Leave a Comment