Telugu News » Hyderabad : ఐటీ ఉద్యోగులకు పోలీసుల వార్నింగ్!

Hyderabad : ఐటీ ఉద్యోగులకు పోలీసుల వార్నింగ్!

చంద్రబాబు అరెస్ట్‌ ను నిరసిస్తూ మూడు రోజులుగా ఐటీ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. శుక్రవారం కూడా పలు ప్రాంతాల్లో నిరసనలకు ప్లాన్ చేశారు.

by admin
police-warning-to-it-employees

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ ఐటీ ఉద్యోగులు ధర్నాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad) లోని ఐటీ కారిడార్ లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీసులు (Police) పర్మిషన్ లేదని చెబుతున్నా వెనక్కి తగ్గడం లేదు. అరెస్టులు చేస్తున్నా ఆగడం లేదు. ఈ క్రమంలో పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నగరంలో ఐటీ ఉద్యోగుల (IT Employees) ఆందోళనలపై ఆంక్షలు విధించారు.

police-warning-to-it-employees

చంద్రబాబు అరెస్ట్‌ ను నిరసిస్తూ మూడు రోజులుగా ఐటీ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. శుక్రవారం కూడా పలు ప్రాంతాల్లో నిరసనలకు ప్లాన్ చేశారు. ఐటీ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులు సాయంత్రం మణికొండ మర్రిచెట్టు కూడలి వద్దకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే, శనివారం నానక్ రామ్ గూడ టోల్ గేట్ నుంచి కార్ల రాలీ నిర్వహించడానికి నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఐటీ ఉద్యోగుల కార్యక్రమాలకు పోలీసుల అనుమతి లేదని స్పష్టం చేశారు. అయినా కూడా నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్ రాంగూడలో పోలీసులు ఆంక్షలు విధించారు.

తమ అనుమతి లేకుండా ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు పోలీసులు. ధర్నాలు చేసి సామాన్య ప్రజలకు ఆటంకం కలిగిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. ఆందోళన చేసే ఐటీ ఉద్యోగుల కంపెనీలకు నోటీసులు పంపిస్తామన్నారు.

You may also like

Leave a Comment