Telugu News » Green Ganesh : ఆకట్టుకుంటున్న గ్రీన్ గణేష్….ఎక్కడో తెలుసా….!

Green Ganesh : ఆకట్టుకుంటున్న గ్రీన్ గణేష్….ఎక్కడో తెలుసా….!

దేశంలోనే మొదటి సారిగా నాగోల్‌లో మొక్కలతో రూపొందించిన గ్రీణ్ గణేష్ విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

by Ramu
first time green ganesha idol in country

గణేష్ (Ganesh) నవరాత్రులను దేశ వ్యాప్తంగా భక్తులు (Devotees) ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అంతా గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి భక్తి శ్రద్దలతో కొలుస్తున్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు గణపతికి విభిన్న రకాల నైవేద్యాలను సమర్పిస్తున్నారు. వినాయక మండపాల్లో భజనలతో చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి పోతున్నారు.

first time green ganesha idol in country

ఇక నిర్వాహకులు గణపతి విగ్రహాల ద్వారా అద్బుతమై సందేశాలను ఇస్తున్నారు. ఇటీవల చంద్రయాన్ -3 గురించి ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చంద్రయాన్ గణపతిని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే పర్యావరణ పరిరక్షణ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు నాగోల్ కు చెందిన భక్తులు వినూత్న రీతిలో జరుపుకుంటున్నారు.

దేశంలోనే మొదటి సారిగా నాగోల్‌లో మొక్కలతో రూపొందించిన గ్రీణ్ గణేష్ విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం 20 అడుగుల ఎత్తులో వుంది. ఈ విగ్రహం తయారీకి 5000 వేల మొక్కలతో తయార చేశారు. తొమ్మిది రోజుల పాటు గ్రీన్ గణేశునికి భక్తులు పూజలు చేస్తున్నారు. గ్రీన్ గణేష్ నీ దర్శించుకుంటున్న ప్రతి భక్తుడికీ ప్రసాదం కింద ఓ మొక్కను నిర్వాహకులు ఇస్తున్నారు.

నిమజ్జనం రోజు గణపతిలోని విగ్రహాలను భక్తులకు అందజేయనున్నారు. దేశంలోని ప్రతి ఒక్కరిలో మొక్కలు పెంచాలనే ఆలోచన తీసుకురావాలని నిర్వహకులు భావిస్తున్నారు. ఆ పచ్చదనంతో ఆరోగ్యమైన గాలి పీల్చుకుని ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేలా ఆ వినాయకుడు తన ఆశీస్సులను ప్రజలకు అందజేయాలని కోరుకుంటున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.

You may also like

Leave a Comment