Telugu News » మోహినీ అవతారంలో దర్శనమిచ్చిన స్వామి వారు!

మోహినీ అవతారంలో దర్శనమిచ్చిన స్వామి వారు!

ఏడాదిలో గరుడోత్సవం నాడు మాత్రమే ఆభరణాలు గర్భాలయం దాటి రానున్నాయి.

by Sai
tirumala-sri-venkateswara-swamy-in-mohini-avataram

కలియుగ దైవం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజైన శుక్రవారం ఉదయం మోహినీ అవతారంలో స్వామి వారు శ్రీమలయప్ప స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో బంగారు తిరుచ్చి పై ఊరేగారు. నేటి ఉదయం 10 గంటల వరకు కూడా వాహన సేవ జరిగింది.

tirumala-sri-venkateswara-swamy-in-mohini-avataram

ఈ ఉత్సవాల్లో భాంగా రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభం అవుతుంది. ఈ సేవలో కేవలం సర్కారు హారతి మాత్రమే ఉంటుంది. ఇతర హారతులు వేటిని కూడా అనుమతించడం లేదని టీటీడీ తెలిపింది. గరుడోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

గరుడ వాహనాన్ని మూల విరాట్ ఆభరణాలు అలంకరించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశిష్టమైన గరుడ వాహన సేవ ఉంటుంది. ఏడాదిలో గరుడోత్సవం నాడు మాత్రమే ఆభరణాలు గర్భాలయం దాటి రానున్నాయి. అందుకే గరుడ వాహనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. గ్యాలరీలో రెండు లక్షల మంది వాహనసేవ తిలకించేలా ఏర్పాట్లు చేశారు. ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలను రద్దు చేశారు.

పార్కింగ్‌కు ప్రత్యేక ప్రాంతాలు ఏర్పాటు చేశారు. 15 వేల వాహనాల పార్కింగ్‌కు తిరుమలలో అవకాశం ఉంది. 15 వేల వాహనాలు దాటితే తిరుపతిల్లోనే పార్క్ చేసుకోవాలని టిటిడి అధికారులు సూచించారు. విలువైన వస్తువులు తీసుకరావద్దని భక్తులకు పోలీసులు సూచించారు. ఐదు వేల మంది పోలీసులు, 1800 టిటిడి విజిలెన్స్‌తో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు.

ఆర్టీసీ అధికారులు బస్టాండ్‌ నుంచే కాక తిరుపతిలోని ప్రధాన కూడళ్ల నుంచి బస్సులను తిరుమలకు నడుపుతున్నారు. గురువారం సాయంత్రం 6 నుంచి 23న ఉదయం 6 గంటల వరకు తిరుమల కొండపై ద్విచక్ర వాహనాలకు అనుమతి రద్దు చేశారు. తిరుమలలో జీఎన్‌సీ నుంచి వాహనాల పార్కింగ్‌ ప్రాంతాలు కేటాయించారు. వీవీఐపీ పెద్ద బ్యాడ్జీ వాహనాలకు రాంభగీచ వద్ద, వీఐపీ చిన్న బ్యాడ్జీలు ఉన్న వాహనాలకు ముల్లగుంట, సప్తగిరి గెస్ట్‌హౌస్‌ వద్ద పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలకు పోలీసులు పార్కింగ్‌ పాస్‌లు కేటాయిస్తారని అధికారులు తెలిపారు.

You may also like

Leave a Comment