Telugu News » అది దళిత బంధు కాదు..దళారీ బంధు!

అది దళిత బంధు కాదు..దళారీ బంధు!

దళిత బంధు' బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు 'దళారీ బంధు'గా మారిందనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాల్నా? అని నిలదీశారు.

by Sai
dalit-bandhu-brs-mlas-dalari-bandhu-rs-praveen-kumar-fire

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా బీఎస్పీ నేత ఆర్‌ ఎస్‌ ప్రవీణ్ కుమార్ సోషల్‌ మీడియా వేదికగా బీఆర్‌ఎస్‌ మీద ఫైర్‌ అయ్యారు. దళిత బంధు పథకానికి నిధుల కొరత ఉందని అందుకే బీఆర్‌ఎస్ నేతలు మరో కొత్త పథకానికి తెర తీశారనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది.

dalit-bandhu-brs-mlas-dalari-bandhu-rs-praveen-kumar-fire

ఈ క్రమంలోనే ఆర్ఎస్పీ మాట్లాడుతూ… దళిత బంధు’ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ‘దళారీ బంధు’గా మారిందనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాల్నా? అని నిలదీశారు.చట్టబద్దంగా ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన సబ్‌ ప్లాన్‌ నిధులను సీఎం కేసీఆర్ దారి మళ్ళించి తన స్వార్థం కోసం, పార్టీ కోసం ‘దళిత బంధు’ ప్రవేశపెట్టారన్నారు. బీసీల ఓట్ల కోసం ‘బీసీ బంధు’ ప్రవేశపెట్టారన్నారు.

అసలు తెలంగాణలో బంధు పథకాలు అనేది ప్రవేశపెట్టింది పేదల కోసమా లేక దందాలు చేసే కార్యకర్తల కోసమా అంటూ ఆయన ప్రశ్నించారు. దళితులు, బీసీల ‘ఓట్ల’ కోసం ఎన్నికల ముందు కేసీఆర్ ప్రవేశపెట్టే ఎన్ని ‘బంధు’ పథకాలైనా, పేదోళ్ల బతుకులు మార్చవని, బహుజనులకు రాజ్యాధికారం దక్కితే తప్ప సాధ్యం కాదని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment