Telugu News » Ambulance : డోలి కట్టి గర్భిణిని 3 కిలోమీటర్లు మోసుకు పోయిన గ్రామస్తులు…. !

Ambulance : డోలి కట్టి గర్భిణిని 3 కిలోమీటర్లు మోసుకు పోయిన గ్రామస్తులు…. !

అంబులెన్స్ (Ambulance) దగ్గరకు చేరుకునేందుకు ఆ నిండు గర్బిణీ మూడు కిలో మీటర్లు వెళ్లాల్సి వచ్చింది.

by Ramu

అంబులెన్స్ (Ambulance) దగ్గరకు చేరుకునేందుకు ఆ నిండు గర్భిణి మూడు కిలో మీటర్లు వెళ్లాల్సి వచ్చింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు మంచాన్ని డోలీగా మార్చి తీసుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన ములుగు (Mulugu) జిల్లాలో చోటు చేసుకుంది. ఈ నెల 24న ఏటూరు నాగారం మండలం రాయబంధం గొత్తి కోయగూడేనికి చెందిన గర్భిణి సోది పోసికి పురిటి నొప్పులు మొదలయ్యాయి.

ఈ క్రమంలో ఆమె నొప్పులు పడుతున్న విషయాన్ని ఆశా వర్కర్ కు గ్రామస్తులు తెలియజేశారు. దీంతో విషయాన్ని 108 సిబ్బందికి ఆశా కార్యకర్త తెలియజేసింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు బయలు దేరారు. అయితే ఆ గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు లేదని గుర్తించిన అంబులెన్స్ సిబ్బంది ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు.

తాము గ్రామ సమీపానికి మాత్రమే రాగలమని అంబులెన్స్ సిబ్బంది చెప్పారు. దీంతో గ్రామస్తులు మంచానికి తాళ్లు కట్టి దాన్ని డోలిగా మార్చారు. మంచానికి తాళ్లు కట్టి ఆమెను మూడు కిలో మీటర్ల దూరం వరకు గ్రామస్తులు తీసుకు వెళ్లారు. అప్పటికే అక్కడ వున్న అంబులెన్స్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఆమెకు చికిత్స అందించారు.

ప్రస్తుతం గర్భిణి సోది పోసి ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రం వచ్చి పదేండ్లు గడుస్తున్నా తమ గ్రామానికి పక్కా రోడ్లు లేక పోవడం విచారకరమని గ్రామస్తులు వాపోతున్నారు.

You may also like

Leave a Comment