Telugu News » KCR : మోడీ రాక.. కేసీఆర్ కు జ్వరం!

KCR : మోడీ రాక.. కేసీఆర్ కు జ్వరం!

కేసీఆర్ కు వచ్చిన ఈ జ్వరం మామూలుగా వచ్చిందా? లేక, ప్రధాని మోడీకి స్వాగతం చెప్పడం ఇష్టంలేక కావాలని తెప్పించుకున్నదా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

by admin

– అక్టోబర్ 1న రాష్ట్రానికి మోడీ
– స్వాగతం అంశంపై మరోసారి చర్చ
– ఇంకోసారి కేసీఆర్ స్కిప్ చేసే ఛాన్స్
– ఇప్పటికే ఫీవర్ తో..
– బాధపడుతున్నారని కేటీఆర్ ప్రకటన
– ఇది మోడీ ప్రోగ్రాం డుమ్మా కొట్టేందుకేనా?
– రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ

ఎన్నికల టైమ్ దగ్గరపడుతోంది. అభ్యర్థుల్ని ప్రకటించినా.. కీలకమైన ప్రచారాన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు బీఆర్ఎస్ (BRS). దానికి కారణం సీఎం కేసీఆర్ (CM KCR) వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. మంత్రి కేటీఆర్ (KTR) ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం దగ్గు, జ్వరం బారినపడ్డారు కేసీఆర్. రెండు, మూడు రోజుల్లో తగ్గుతుందిలే అని ఇంట్లోనే ట్రీట్ మెంట్ తీసుకున్నారు. అయితే.. ఫీవర్ తగ్గకపోవడంతో యశోదా ఆస్పత్రి నుంచి ఐదుగురు ప్రత్యేక వైద్యుల బృందం ప్రగతి భవన్ కు వెళ్లింది. సీఎంకు చకిత్స అందిస్తోందని తెలిపారు కేటీఆర్.

modi kcr

కేసీఆర్ కు వచ్చిన ఈ జ్వరం మామూలుగా వచ్చిందా? లేక, ప్రధాని మోడీ (PM Modi) కి స్వాగతం చెప్పడం ఇష్టంలేక కావాలని తెప్పించుకున్నదా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. మూడు రోజుల్లో రెండుసార్లు తెలంగాణలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. అక్టోబరు 1న మహబూబ్‌ నగర్, అక్టోబర్ 3న నిజామాబాద్‌ కు వస్తున్నారు. అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నా.. ఈ వేదికల నుంచే ఆయన బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని కమలనాథులు అంటున్నారు.

ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారంటే గౌరవ సూచికగా సీఎం స్వాగతం చెప్పడం ఆనవాయితీ. అయితే.. దీన్ని ఎప్పుడో కేసీఆర్ పక్కనపెట్టేశారు. జాతీయ రాజకీయాల ప్రకటన చేసినప్పటి నుంచి బీజేపీతో కయ్యానికి కాలుదువ్వారు కేసీఆర్. ఈ క్రమంలోనే రాష్ట్రానికి మోడీ ఎప్పుడు వచ్చినా ఏదో ఒక సాకుతో ఆయన వెళ్లకుండా మంత్రి తలసానిని పంపుతున్నారు. గతంలో సమతామూర్తి విగ్రహావిష్కరణ సమయంలో కూడా జ్వరం కారణంగానే పీఎంకు వెల్ కమ్ చెప్పలేదు. ఇప్పుడు మరోసారి ఆయనకు ఫీవర్ అని అంటున్నారు కేటీఆర్.

సరిగ్గా మోడీ రాష్ట్రానికి వస్తున్న ఈ సమయంలోనే కేసీఆర్ కు జ్వరం రావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకంగా ప్రకటన చేయాల్సిన పని లేకుండా కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారని కేటీఆర్ ముందుగానే సమాచారం ఇచ్చారని రాజకీయ పండితులు విశ్లేషణ చేస్తున్నారు. ఇంకోవైపు కేసీఆర్ జ్వరంతో ఇబ్బంది పడుతుండడంతో.. పార్టీ కార్యక్రమాలు కేటీఆరే చూసుకుంటున్నారు.

You may also like

Leave a Comment