Telugu News » Ms Swamynathan : భారత హరిత విప్లవ పితామహుడు ఇక లేరు……!

Ms Swamynathan : భారత హరిత విప్లవ పితామహుడు ఇక లేరు……!

ఆ తర్వాత బెంగాల్ లో వచ్చిన కరువు పరిస్థితులను చూసి ఆయన చలించి పోయారు.

by Ramu
Ms swamynatha passed away

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు (Father of indian Green Revolution) ఎంఎస్ స్వామినాథన్ (MS Swamynathan) కన్ను మూశారు. వయో సంబంధం సమస్యలతో ఈ రోజు ఉదయం 11 గంటలకు చెన్నైలోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. స్వామి నాథన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Ms swamynatha passed away

మంకోబు సాంబ శివన్ స్వామి నాథన్ (MS Swamynathan) 7 అగస్టు 1925న తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి సాంబ శివన్. మొదట తండ్రి మాదిరిగానే ఆయన మెడికల్ స్కూల్ లో చేరారు. కానీ ఆ తర్వాత బెంగాల్ లో వచ్చిన కరువు పరిస్థితులను చూసి ఆయన చలించి పోయారు. దీంతో వ్యవసాయ పరిశోధకుడిగా మారాలని నిర్ణయించుకున్నారు.

1949లో జెనెటిక్ బంగాళ దుంపలపై పరిశోధనలతో ఆయన తన కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత గోధుమ, బియ్యం, జనపనారలపై పరిశోధనలు చేశారు. హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాంగ్ , ఇతర వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు జరిపి అధిక దిగుబడిని ఇచ్చే గోధుమ వంగడాలను ఆయన అభివృద్ధి చేశారు. ఫాదర్ ఆఫ్ ఎకనామికల్ ఎకాలజీగా ఐరాస ఎన్విరాన్ మెంటల్ ప్రోగ్రామ్ గుర్తించింది.

వ్యవసాయ రంగంలో ఆయన చేసిన పరిశోధనలకు గాను 1987లో ఆయనకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వచ్చింది. అంతకు ముందు 1971లో ఆయనకు రామన్ మెగసెస్ అవార్డు కూడా ప్రధానం చేశారు. 1986లో అల్బర్ట్ ఐన్ స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు వచ్చింది. వాటితో పాటు పద్మ విభూషణ్ ,పద్మ భూషణ్, పద్మ శ్రీ,, ఇందిరా గాంధీ అవార్డు, లాల్ బహదూర్ శాస్త్రీ అవార్డులు లభించాయి.

You may also like

Leave a Comment