Telugu News » KTR : ‘స్కాంగ్రెస్’ కొత్త కుట్ర.. కేటీఆర్ సంచలన ట్వీట్!

KTR : ‘స్కాంగ్రెస్’ కొత్త కుట్ర.. కేటీఆర్ సంచలన ట్వీట్!

ఇంకోవైపు ట్విట్టర్(ఎక్స్)లోనూ కాంగ్రెస్ పై ఎటాక్ కొనసాగిస్తున్నారు కేటీఆర్. తాజాగా సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణలో గెలుపు కోసం కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని.. అదికూడా బెంగళూరు వేదికగా జరుగుతోందని ఆరోపించారు.

by admin
KTR Fire on Congress party

కర్ణాటక (Karnataka) లో గెలుపు తర్వాత తెలంగాణలో పాగా వేయాలని కాంగ్రెస్ (Congress) గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈమధ్యే ఆరు గ్యారెంటీలను ప్రకటించి.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం అభ్యర్థుల ప్రిపరేషన్ లో ఉంది. ఆరు గ్యారెంటీలను జనంలోకి తీసుకెళ్తోంది. అయితే.. కాంగ్రెస్ హామీలు ప్రకటించిన దగ్గర్నుంచి మంత్రి కేటీఆర్ (KTR) విమర్శల దాడిలో స్పీడ్ పెంచారు. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. కాంగ్రెస్ ను నమ్మొద్దని.. మళ్లీ గత దరిద్రం మనకొద్దని కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు.

KTR Fire on Congress party

ఇంకోవైపు ట్విట్టర్(ఎక్స్)లోనూ కాంగ్రెస్ పై ఎటాక్ కొనసాగిస్తున్నారు కేటీఆర్. తాజాగా సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణ (Telangana) లో గెలుపు కోసం కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని.. అదికూడా బెంగళూరు (Bengaluru) వేదికగా జరుగుతోందని ఆరోపించారు. అక్కడి కాంట్రాక్టర్ల దగ్గర పన్ను రూపంలో డబ్బులు వసూలు చేసి తెలంగాణలో ఎన్నికల సమయంలో ఖర్చు చేయాలని చూస్తోందని విమర్శించారు.

కేటీఆర్ చేసిన ట్వీట్

కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌ కు నిధులు ఇవ్వడానికి బెంగళూరు బిల్డర్లకు చదరపు అడుగుకి రూ.500 ‘‘రాజకీయ ఎన్నికల పన్ను’’ విధించడం ప్రారంభించింది. పాత అలవాట్లు ఎక్కడికి పోతాయ్? గ్రాండ్ ఓల్డ్ పార్టీ చేసిన కుంభకోణాలు అన్నీ ఇన్ని కావు. అందుకే, దీనికి స్కాంగ్రెస్ అని పేరు పెట్టారు. ఎంత డబ్బు ముట్టజెప్పినా తెలంగాణ ప్రజలను స్కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదు.

మరోవైపు, కేటీఆర్ ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ వర్గాలు కాంగ్రెస్ స్కాములకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకుంటున్నారని విమర్శిస్తున్నారు. అయితే.. హస్తం శ్రేణులు మీ సంగతేంటని కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ లిక్కర్ పార్టీ అంటూ సెటైర్లు వేస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన స్కాములపై ప్రశ్నిస్తున్నారు.

You may also like

Leave a Comment