Telugu News » Etala Rajender : బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే….!

Etala Rajender : బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే….!

కొన్ని మీడియా ఛానెల్స్ (Media Channels) పని గట్టుకుని విష ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

by Ramu
BJP is alternative to brs says Etala rajender

బీఆర్ఎస్‌ (BRS) కు ప్రత్యామ్నాయం బీజేపీ (BJP) అని ప్రజలు భావిస్తున్నారని బీజేపీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ , ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. కొన్ని మీడియా ఛానెల్స్ (Media Channels) పని గట్టుకుని విష ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. వాటి చరిత్ర రాబోయే కాలంలో తెలుస్తుందన్నారు.

BJP is alternative to brs says Etala rajender

బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు చిత్తరంజన్ దాసు, కృష్ణ యాదవ్ లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ…. జియాంట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి చిత్త రంజన్ దాస్, జంట నగరాల రాజకీయాల్లో కీలక నేత మాజీ మంత్రి కృష్ణ యాదవ్ నాయకత్వంలో బీజేపీలో చేరిన కార్యకర్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేందర్, వైసీపీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సుధీర్ లు వందలాదిమంది కార్యకర్తలు, నాయకులతో బీజేపీలో చేరుతున్నట్టు తెలిపారు. రాబోయే కాలంలో తెలంగాణ గడ్డమీద బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి బీజేపీ సత్తా చాటుతామన్నారు.

అసత్య ప్రచారాలు నమ్మి అగం కావద్దని ఆయన సూచించారు. ప్రజల అంతరంగానికి అనుగుణంగా బీజేపీ తప్పక పనిచేస్తుందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ గడ్డపై బీజేపీ విజయం సాధిస్తుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. వివిధ హోదాల నుంచి వచ్చిన నాయకులకు బీజేపీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

You may also like

Leave a Comment