Telugu News » Modi : ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా పార్టీని నడుపుతున్నాయి…. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై మోడీ ఫైర్……!

Modi : ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా పార్టీని నడుపుతున్నాయి…. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై మోడీ ఫైర్……!

సామాన్య ప్రజల గురించి ఆ కుటుంబాలకు ఎలాంటి ఆలోచన లేదని తెలిపారు.

by Ramu

బీఆర్ఎస్ (BRS) సర్కార్‌పై ప్రధాని మోడీ (PM Modi) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అవినీతి (Corruption), కమీషన్లకు పేరు గాంచిన రెండు కుటుంబాలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయంటూ మండిపడ్డారు. ఆ రెండు కుటుంబాలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (Private limited Company) గా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయంటూ తీవ్రంగా విరుచుకు పడ్డారు.

pm modis sensational comments on brs govt

సామాన్య ప్రజల గురించి ఆ కుటుంబాలకు ఎలాంటి ఆలోచన లేదని తెలిపారు. పాలమూరులో నిర్వహించిన సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో వుందన్నారు. రాష్ట్రంలో రెండు కుటుంబాలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా పార్టీని నడుపుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ కంపెనీలో డైరెక్టర్ తో పాటు మేనేజర్, సెక్రెటరీ అన్ని పదవులు ఆ కుటుంబ సభ్యులేవనన్నారు. కేవలం కొన్ని అసవరాల నిమిత్తం మరి కొందరిని తమ సహయకులుగా ఆ పార్టీ నియమించుకుంటోందన్నారు. పథకాల పేరు చెప్పి తెలంగాణ రైతులను బీఆర్ఎస్ సర్కార్ దోచుకుంటోందన్నారు. రుణ మాఫీ పేరు చెప్పి బీఆర్ఎస్ ఓట్లను దండుకుందన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించిందన్నారు.

బీజేపీపై ప్రజలు చూపిస్తున్న ప్రేమను చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఈ రోజు రాత్రి నిద్ర పట్టదన్నారు. రైతులను బీఆర్ఎస్ సర్కార్ కల్లబొల్లి మాటలతో మభ్య పెడుతోందని విమర్శలు గుప్పించారు. సాగునీటీ కాలువల పేరు చెప్పి తెలంగాణ ప్రభుత్వం గొప్పలకు పోతోందన్నారు. రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు కూడా ఇవ్వటం లేదని విమర్శలు చేశారు.

You may also like

Leave a Comment