Telugu News » Telangana : దేవుళ్లకు ఐటీ నోటీసులు.. తెలంగాణలోనే!

Telangana : దేవుళ్లకు ఐటీ నోటీసులు.. తెలంగాణలోనే!

ఆలయాలకు ఐటీ నోటీసులు అందడంపై భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్టు ఆలయాలపై కఠిన వైఖరిని అవలంబించడం సమంజసం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

by admin
Income Tax Notice To Komuravelli Mallanna

తెలంగాణ (Telangana) లో ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. భక్తుల కొంగుబంగారంగా దేవుళ్లు, దేవతలు నిత్యం పూజలు అందుకుంటున్నారు. అయితే.. తెలంగాణలోని పలు ప్రముఖ దేవాలయాలకు ఆదాయపు పన్ను శాఖ (Incom Tax) నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆదాయపు పన్ను కట్టాలంటూ నోటీసులు పంపించారు. అధికారులు.

Income Tax Notice To Komuravelli Mallanna

ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సిన దేవుళ్లలో కొమురవెల్లి మల్లన్న (Komuravelli Mallanna) స్వామి తొలి స్థానంలో ఉన్నారు. రూ.8 కోట్ల పన్ను కట్టాలని, సకాలంలో కట్టనందువల్ల మరో రూ.3 కోట్ల జరిమానా కూడా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వేములవాడ రాజన్న, బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు ఇంకా పలు దేవాలయాలకు కూడా నోటీసులు అందాయి.

ఆదాయపు పన్ను మినహాయింపు కోసం గడువు ముగిసిన 12ఏ రిజిస్ట్రేషన్ చేయించలేదు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అధికారులు. 1995 నుంచి ఇప్పటివరకు ఐటీ రిటర్న్ లు ఆదాయపు పన్ను శాఖకు సమర్పించలేదు. ఐటీ రిటర్న్ లు, ఆడిట్ వివరాలు సమర్పించాలని ఐటీ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం వహించడంతో తాజాగా నోటీసులు జారీ అయ్యాయి.

మరోవైపు ఆలయాలకు ఐటీ నోటీసులు అందడంపై భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్టు ఆలయాలపై కఠిన వైఖరిని అవలంబించడం సమంజసం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

You may also like

Leave a Comment