Telugu News » KTR : రేవంత్ ఆర్ఎస్ఎస్ మనిషి.. ఎన్నికల తర్వాత బీజేపీలోకి జంప్!

KTR : రేవంత్ ఆర్ఎస్ఎస్ మనిషి.. ఎన్నికల తర్వాత బీజేపీలోకి జంప్!

అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయని కాంగ్రెస్‌.. అలవికాని హామీలను ఇప్పుడు ఇస్తోందని దుయ్యబట్టారు కేటీఆర్. హామీలతో ప్రలోభ పెట్టాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ నాయకులకు, అదానీ నుంచి బీజేపీ నేతలకు డబ్బులు వస్తున్నాయని ఆరోపించారు. వారి వద్ద నుంచి దబాయించి పైసలు తీసుకోవాలని సూచించారు.

by admin
Minister KTR fire on Revanth Reddy In Shadnagar Public Meeting

– బీజేపీ వాళ్లు నీళ్ల వాటా తేల్చరు
– కాంగ్రెస్ వాళ్లు కేసులేసి ఇబ్బంది పెడతారు
– ఈ పార్టీలతో ప్రజలకు ఒరిగేదేం లేదు
– అలవికాని హామీలతో కాంగ్రెస్ మభ్యపెడుతోంది
– రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసిపోయారు
– మంత్రి కేటీఆర్ విమర్శలు

రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు మంత్రి కేటీఆర్ (KTR). మ‌హేశ్వ‌రం (Maheswaram) నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రావిర్యాల వ‌ద్ద నిర్మించిన విజ‌య మెగా డెయిరీని మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, స‌బితా ఇంద్రారెడ్డితో క‌లిసి ప్రారంభించారు. ఈ డెయిరీని 40 ఎక‌రాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల‌తో నిర్మించారు. రోజుకు ల‌క్ష లీట‌ర్ల టెట్రా బిక్ పాల ఉత్ప‌త్తి చేసేలా మిష‌న‌రీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. విజ‌య డెయిరీకి పాలు స‌ర‌ఫ‌రా చేసే పాడి రైతుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రూ.350 కోట్ల ప్రోత్సాహ‌కాలు ఇచ్చామ‌ని తెలిపారు.

Minister KTR fire on Revanth Reddy In Shadnagar Public Meeting

ప‌దేండ్ల‌లో తెలంగాణ (Telangana).. ప్ర‌తి రంగంలో పురోగ‌తి సాధించింద‌ని అన్నారు కేటీఆర్. దేశానికే దారి చూపే విధంగా ముందుకు పోతున్నామన్న ఆయన.. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను కాపాడుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తోందని మొండిపడ్డారు. ఆర్టీసీని గ‌వ‌ర్న‌మెంట్‌ లో విలీనం చేసుకున్నామని.. విజ‌య డెయిరీ న‌ష్టాల్లో ఉంటే లాభాల బాట‌లోకి తీసుకెళ్లామని వివరించారు. పాడి రైతుల‌కు అండ‌గా నిల‌బ‌డ్డామన్న కేటీఆర్.. గ‌వ‌ర్న‌మెంట్‌ కు డివిడెంట్ ఇచ్చే స్థాయికి విజ‌య డెయిరీ వ‌చ్చింద‌ని పేర్కొన్నారు.

అంతకుముందు, షాద్​ నగర్ (Shad Nagar) నియోజకవర్గంలో నందిగామ మండలం చాకలి గుట్ట తండా గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే, కొత్తూరు మండల పరిధిలో మున్సిపల్ భవనాన్ని, 60 డబుల్ బెడ్రూం ఇళ్లను ఓపెన్ చేశారు. అనంతరం షాద్ ​నగర్ పట్టణంలో 17వందల డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు కేటీఆర్. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎంతో అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. షాద్‌ నగర్‌ కు నీళ్లు ఇచ్చేది కేసీఆర్‌.. తెచ్చేది అంజయ్య యాదవ్​ అని చెప్పారు. ఐదు రిజర్వాయర్లను నిర్మిస్తున్నామని.. లక్ష్మీదేవిపురం కూడా నిర్మాణం అవుతుందని తెలిపారు.

అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయని కాంగ్రెస్‌ (Congress).. అలవికాని హామీలను ఇప్పుడు ఇస్తోందని దుయ్యబట్టారు కేటీఆర్. హామీలతో ప్రలోభ పెట్టాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ నాయకులకు, అదానీ నుంచి బీజేపీ (BJP) నేతలకు డబ్బులు వస్తున్నాయని ఆరోపించారు. వారి వద్ద నుంచి దబాయించి పైసలు తీసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో రైతుబంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు వస్తేనే బీఆర్ఎస్​ కు ఓటు వేయాలని పేర్కొన్నారు. బీజేపీ వాళ్లు నీళ్ల వాటా తేల్చరని.. కాంగ్రెస్‌ వాళ్లు కేసులేసి ఇబ్బంది పెడతారని విమర్శించారు. రేవంత్ ​రెడ్డి (Revanth Reddy) ఆర్‌ఎస్‌ఎస్‌ మనిషి అని.. ఆ పార్టీ నేతలే చెప్పారని వివరించారు. రేవంత్​ రెడ్డి బీజేపీతో కలసిపోయారని.. ఎన్నికల తర్వాత ఆ పార్టీలోకి జంప్‌ అవడం ఖాయమని అన్నారు కేటీఆర్.

You may also like

Leave a Comment