Telugu News » CM KCR : ఆశావహుల పై దృష్టి సారించిన తెలంగాణ సీఎం.. పదవుల పండగ షురూ..

CM KCR : ఆశావహుల పై దృష్టి సారించిన తెలంగాణ సీఎం.. పదవుల పండగ షురూ..

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ (MLC) వీ భూపాల్‌రెడ్డిని నియమించగా డైరెక్టర్లుగా గోసుల శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ సలీం పదవులు దక్కించుకొన్నారు.

by Venu
cm kcr

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ(Telangana) సీఎం కేసీఆర్‌(CM KCR) అసంతృప్తులు, ఆశావహుల పై దృష్టి సారించారు. ఈ ఎన్నికల్లో పోరు పోటాపోటీగా ఉంటున్న నేపధ్యంలో ఆయా సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసారు.

CM KCR

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ (MLC) వీ భూపాల్‌రెడ్డిని నియమించగా డైరెక్టర్లుగా గోసుల శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ సలీం పదవులు దక్కించుకొన్నారు. అలాగే తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా మటం బిక్షపతిని, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మహ్మద్ తన్వీర్ నియమితులయ్యారు.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కార్పొరేషన్‌ పదవులకు ఎంపికైన వారు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఇకపోతే ఆర్టీసీ (RTC) ఛైర్మన్‌గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతుబంధు సమితి ఛైర్మన్‌గా స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎంబీసీ (MBC) ఛైర్మన్‌గా నందికంటి శ్రీధర్‌, మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్‌గుప్తా నియమితులయ్యారు.

పదవులు రాకుంటే భారాస వీడాలనే ఆలోచనలో ఉన్న అభ్యర్థులను మచ్చిక చేసుకొనేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

You may also like

Leave a Comment