Telugu News » Bad Teacher : పాఠశాలలో కీచక టీచర్.. బడితెపూజ చేసిన విద్యార్థి బంధువులు..

Bad Teacher : పాఠశాలలో కీచక టీచర్.. బడితెపూజ చేసిన విద్యార్థి బంధువులు..

కాకినాడ (Kakinada) పిఠాపురంలో (Pithapuram ) ఓ కీచక టీచర్‌ (Teacher) లీలలు వెలుగులోకి వచ్చాయి.

by Venu

లోకంలో ఆడపిల్లలకు రోజురోజుకు భద్రత కరువు అవుతుంది. ముఖ్యంగా పాఠశాలల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించ వలసిన ఉపాధ్యాయులు కొందరు కామాంధులుగా మారడం తరచుగా వార్తల్లో రావడం బాధాకరం. ఈ నేపధ్యంలో కాకినాడ (Kakinada) పిఠాపురంలో (Pithapuram ) ఓ కీచక టీచర్‌ (Teacher) లీలలు వెలుగులోకి వచ్చాయి.

పిఠాపురం ఆదిత్య పాఠశాలలో విధులు నిర్వహిస్తోన్నఉపాధ్యాయుడు బాలికలను లైంగిక వేధింపులకు గుర్తిచేస్తున్నాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు.

గత రెండు నెలలుగా ఏడవ తరగతి చదువుతోన్న విద్యార్థిని పట్ల సోషల్ టీచర్ దుర్గారావు అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లిందట. వారు ప్రిన్సిపాల్, ఇతర టీచర్లకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోవడంతో విద్యార్థిని కుటుంబసభ్యులు, బందువులు పాఠశాల దగ్గర అందోళన చేపట్టారు.

చివ‌ర‌కు పోలీసులు జోక్యం చేసుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. యాజ‌మాన్యం కూడా నిందితుడి పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఒప్పుకోవ‌డంతో నిర‌స‌న‌కారులు శాంతించారు. కాగా పిల్లలకు రక్షణగా ఉండవలసిన ఉపాధ్యాయులే భక్షకులా మారుతున్న కాలంలో ఆడపిల్లల భద్రత గాల్లో దీపంలా మారడం తల్లిదండ్రుల పాలిట శాపంగా మారింది.

You may also like

Leave a Comment