కాంగ్రెస్ పై ఏఐఎంఐఎం (AIMIM) చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ముస్లింల పట్ల కాంగ్రెస్ పార్టీకి విద్వేషం ఉందని ఆయన మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ ఎలాంటి దారుణాలకు పాల్పడిందో తాను ప్రత్యక్షంగా చూశానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను నమ్మవద్దంటూ తన పార్టీ కార్యకర్తలకు ఆయన హితవు పలికారు.
రాజస్థాన్‌లో జునైద్‌ను కాల్చి చంపారని ఆయన తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఆయన కుటుంబాన్ని ఎవరూ ఆదుకోలేదన్నారు. తాము కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చామని కాంగ్రెస్ ఆరోపిచిందన్నారు. ఆ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాము బాబా ఆజమ్ ఖాన్ వారసులమని పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని ఆయన విమర్శలు చేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని ఆయన ఆరోపించారు. గతంలో బీజేపీ నేత కిషన్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి పని చేశారన్నారు. విద్యార్థి దశలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఏబీవీపీలో పని చేశాడని తెలిపారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్కు వీడి బీజేపీలో చేరారన్నారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబును రేవంత్ ఆశ్రయించాడని అన్నారు.
దేశ రాజకీయాల్లో ముస్లింల ప్రాధాన్యత లేకపోవడానికి నెహ్రూ, వల్లబాయ్ పటేల్ కారణమంటూ ఫైర్ అయ్యారు. బీజేపీలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరన్నారు. తాము మౌనంగా కూర్చోవడానికి రాలేదన్నారు. మౌనంగా ఉన్నవాళ్లు ఖతం అవుతారని చెప్పారు. తాము పోరాడేందుకు వచ్చామన్నారు. మనకు చాలా విచిత్రమైన వ్యక్తి ప్రధానిగా ఉన్నారని తెలిపారు. కర్ణాటకకు కేసీఆర్ పైసలు ఇచ్చారని ప్రధాని మోడీ ఆరోపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్వేషాలను రెచ్చ గొట్టేందుకు ప్రధాని మోడీ ప్రయత్నాలు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.