రాజకీయాల్లో ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకోవడం సర్వసాధారణమైన విషయం. ఇక్కడ శాశ్వత శత్రువులు అంటూ ఎవరు ఉండరు. అయితే ఒక్కోసారి నేతలు చేసుకునే విమర్శలు పలు వివాదాలకు దారితీయడం తెలిసిందే.
ఈ క్రమంలో తనపై వచ్చిన పలు విమర్శలకు స్పందించిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాను NDA కూటమిలో ఉన్నానని, సమావేశానికి కూడా హాజరయ్యానని తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల ఎపీ (AP) బాగా నష్టపోయిందని ప్రధాని మోడీ (PM Modi) అన్నట్టు చెప్పారు. కాగా 2014 తరహాలోనే 2024లో జరిగే ఎన్నికల్లో పొత్తులు ఉండాలనేది తన ఆకాంక్ష అని వెల్లడించారు.
వైసీపీ (YCP) వ్యతిరేక ఓటు చీలకూడదని తాను అభిప్రాయపడుతున్నట్టు తెలిపిన పవన్, జి 20 సమ్మిట్ జరుగుతున్నప్పుడు జగన్ చావు తెలివితేటలు ప్రదర్శించారని విమర్శించారు. ఇక చంద్రబాబు పై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపారని అయితే ఆయన అరెస్టు విషయం తెలియక ముందే ఒక సమావేశానికి వెల్లుతోన్న తనను విమానం ఎక్కకుండా అడ్డుకుని రోడ్లపై నిలబెట్టడం న్యాయమా అంటూ ప్రశ్నించారు.
ఇకపోతే జనసేన, బీజేపీ సమన్వయం కోసం గతంలోనే కమిటీలు ఏర్పాటు చేసినట్టు, కొన్ని అంశాలలో ఇరు పార్టీల నేతలు కలిసి కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఇదే విధంగా ఇప్పుడు టీడీపీ, జనసేనలను సమన్వయం చేసేలా కమిటీ వేశాం. మహేందర్ రెడ్డి, దుర్గేష్, కొటికలపూడి గోవింద, యశస్విని, నాయకులు సభ్యులు నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుందని జనసేన నేత పవన్ కళ్యాణ్ వివరించారు.