బ్యాంకు(Banks)ల్లో 2 వేల రూపాయల నోట్ల (Two Thousand Rupees NOtes) మార్పిడికి నేటితో గడువు ముగియనున్నట్టు ఆర్బీఐ (RBI) వెల్లడించింది. నేటితో గడువు ముగిసినప్పటికీ రేపటి నుంచి రూ. 2 వేల నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ పేర్కొంది. అయితే వాటిని కేవలం ఆర్బీఐ బ్యాంకుల్లో మాత్రమే మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పింది.
రేపటి నుంచి రూ. 2 వేల నోట్లను కేవలం ఆర్బీఐలోని 19 కార్యాలయాల్లో మాత్రమే మార్పిడికి అనుమతించనున్నారు. ఒక ట్రాన్సక్షన్ కు గరిష్టంగా రూ. 20వేలు విలువ చేసే నోట్లను మాత్రమే డిపాజిట్ చేసేందుకు ఆర్బీఐ అనుమతిస్తోంది. ప్రస్తుతం ప్రజలు రూ. 2 వేల నోట్లను తమ ఏదైనా బ్యాంకు అకౌంట్ లో క్రెడిట్ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది.
ఇక ఇప్పటి వరకు రూ. 2 వేల నోట్లలో 90 శాతం వెనక్కి వచ్చినట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. వాటిలో 87 శాతం నోట్లు డిపాజిట్ల రూపంలోనే వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. మొత్తం రూ. 3.43 లక్షల కోట్లు విలువ చేసే రూ. 2 వేల నోట్లు వెనక్కి వచ్చినట్టు పేర్కొంది. ఇంకా రూ.12వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వెనక్కి రావాల్సి ఉందని తెలిపింది.
రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ఈ ఏడాది మేలో ఆర్బీఐ ప్రకటించింది. రూ. 2వేల నోట్ల మార్పిడికి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు మొదట గడువుగా నిర్ణయించింది. ఆ తర్వాత తుది గడువును అక్టోబర్ 7కు పెంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.