Telugu News » Navadeep : నవదీప్‌కు ఈడీ నోటీసులు.. విచారణకు హాజరు కావాలంటు ఆదేశం..

Navadeep : నవదీప్‌కు ఈడీ నోటీసులు.. విచారణకు హాజరు కావాలంటు ఆదేశం..

కేసు విషయంలో 10న విచారణకు హాజరు కావాలని నవదీప్‌కు ఈడీ నోటీసులు పంపింది. ఈ నెల 10న హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది.

by Venu

టాలీవుడ్‌ (Tollywood) నటులు (Actors), దర్శకులు ( Directors), హీరోయిన్స్ (Heroines) తో పాటు కొందరు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే వారు కూడా ఈ మధ్యకాలంలో వివాదాల్లో చిక్కుకొన్న విషయం తెలిసిందే. అందులో ప్రస్తుతం టాలీవుడ్‌ నటుడు నవదీప్‌ (Navadeep) చాలా ఫోకస్ అయ్యారు.

ఓ కేసు విషయంలో అయితే నవదీప్‌ అరెస్ట్ వరకు వెళ్లారనే వార్తలు తెరవెనక చాలానే వినిపించాయి. ఆయన అరెస్ట్ ఖాయం అనే వరకు గుసగుసలు వెళ్ళాయి. అయితే ఇదే కేసు విషయంలో 10న విచారణకు హాజరు కావాలని నవదీప్‌కు ఈడీ నోటీసులు పంపింది. ఈ నెల 10న హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది.

ఇకపోతే నార్కోటిక్‌ బ్యూరో కేసు ఆధారంగా ఈడీ నోటీలు జారీచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నవదీప్ ఎదుర్కొంటున్న కేసు విషయంలో టీఎస్‌ న్యాబ్‌ అధికారులు, బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్లను, ఓ దర్శకుడితో పాటు నలుగురి వ్యక్తులను సెప్టెంబర్‌ 14న అరెస్టు చేసి విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణలో నటుడు నవదీప్‌ నిందితులతో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. దీంతో హీరో నవదీప్ చుట్టు ఉచ్చు బిగుసుకోంది.

You may also like

Leave a Comment