Telugu News » Chandrayaan 3: ఆశలో నిరాశ.. చంద్రయాన్3 కథ కంచికేనా..!!

Chandrayaan 3: ఆశలో నిరాశ.. చంద్రయాన్3 కథ కంచికేనా..!!

చంద్రయాన్ 3 లోని ల్యాండర్‌ విక్రమ్‌ (Lander Vikram), రోవర్‌ ప్రజ్ఞాన్‌లు ( Pragyan Rover) 14 రోజుల పాటు చంద్రుడి గురించి విలువైన సమాచారం ఇస్రోకు అందించాయి.

by Venu

ఇస్రో (ISRO) కీర్తిని ప్రపంచ దేశాలకు వ్యాపింపచేసిన చంద్రయాన్ 3 (Chandrayaan) కథ కంచికి చేరినట్టేనా అనే అనుమానాలు ఇస్రో శాస్త్రవేత్తలకు కునుకు లేకుండా చేస్తోందట. ఎన్నో ఆశలతో భారత్‌ (Bharath) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువం చేరిన విషయం తెలిసిందే.

అనంతరం చంద్రయాన్ 3 లోని ల్యాండర్‌ విక్రమ్‌ (Lander Vikram), రోవర్‌ ప్రజ్ఞాన్‌లు ( Pragyan Rover) 14 రోజుల పాటు చంద్రుడి గురించి విలువైన సమాచారం ఇస్రోకు అందించాయి. 14 రోజుల తర్వాత చంద్రునిపై రాత్రి ప్రారంభం కావడంతో విక్రమ్ ల్యాండర్‌ను నిద్రావస్థలోకి పంపించారు శాస్త్రవేత్తలు. అలా 14 రోజుల అనంతరం సెప్టెంబర్‌ 22న అక్కడ సూర్యోదయం కావడంతో ఇస్త్రో శాస్త్రవేత్తలు బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్‌ చేసి విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లు మేల్కొలిపేందుకు ముమ్ముర ప్రయత్నాలు చేశారు.

వాస్తవానికి రాత్రి వేళ చంద్రునిపై ఉష్ణోగ్రత మైనస్ 200 డిగ్రీలకు కూడా పడిపోతుంటుంది. ఫలితంగా ఇస్రో ప్రయత్నాలు విఫలమౌతూవచ్చాయి. ఇక చంద్రునిపై 24 గంటలంటే 28 రోజులతో సమానం. అంటే పగలు 14 రోజులు, రాత్రి 14 రోజులుంటుంది. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మరో 14 రోజులు చంద్రునిపై సూర్య కాంతి ప్రసరించదు. అందుకే ఇస్రో ఆశలు వదులుకున్నట్టే కనిపిస్తోంది.

ఇక ఇస్రో మాజీ ఛైర్మన్‌ కిరణ్‌ కుమార్‌ కూడా చంద్రయాన్‌-3 ప్రాజెక్టు ఇక ముగిసేనట్లేనని అభిప్రాయపడ్డారు. కాని భవిష్యత్తులో ఇది సాధ్యం కావచ్చని ఆశిస్తున్నట్టు తెలిపారు.

You may also like

Leave a Comment