Telugu News » Shalija Dhami : ఎయిర్ ఫోర్స్ చరిత్రలో తొలిసారి… రికార్డు సృష్టించనున్న షాలిజా ధామీ…!

Shalija Dhami : ఎయిర్ ఫోర్స్ చరిత్రలో తొలిసారి… రికార్డు సృష్టించనున్న షాలిజా ధామీ…!

ఎయిర్ ఫోర్స్ చరిత్రలో పరేడ్ కు మహిళా అధికారి నాయకత్వం వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

by Ramu
Woman officer to lead IAF Day parade for the first time today

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force) గ్రూపు కెప్టెన్ (Group Captain) షాలిజా ధామి (Shalija Dhami) చరిత్ర సృష్టించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 91వ వార్షికోత్సవం (Anniversary) సందర్బంగా యూపీలోని ప్రయాగ్ రాజ్(Prayag Raj) లో నిర్వహించే పరేడ్ కు ఆమె నాయకత్వం (Command) వహించనున్నారు.

Woman officer to lead IAF Day parade for the first time today

ఎయిర్ ఫోర్స్ చరిత్రలో పరేడ్ కు మహిళా అధికారి నాయకత్వం వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంబాట్ విభాగాని(Combat Unit) కి కమాండర్ బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళ గతంలో ఆమె చరిత్ర సృష్టించారు. ఆమె 2003లో పశ్చిమ సెక్టార్ లోని మిస్సైల్ స్వాడ్రన్ కు నాయకత్వం వహించారు. ఆ తర్వాత ఆమె ఫ్లైయింగ్ ఇన్ స్ట్రక్టర్ గా అర్హత సాధించారు.

ఇప్పటి వరకు ఆమె 2800 గంటలకు పైగా విమానాలను నడిపారు. చరిత్రలో మొదటిసారిగా అగ్నివీర్ వాయు విభాగంలోని మొత్తం మహిళా బృందం ఈ పరేడ్ లో పాల్గోబోతున్నట్టు ఐఏఎఫ్ కమాండర్ ఆశిష్ మోఘె వెల్లడించారు. పురుషులతో కలిసి మహిళా బృందం కవాతు చేయనున్నట్టు పేర్కొన్నారు. తొలిసారిగా గరుడ్ కమాండర్లు ఈ కార్యక్రమంలో తొలిసారిగా విన్యాసాలను ప్రదర్శించనున్నారు.

ఇది ఇలా వుంటే లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు భారత వాయుసేన, భారత నేవీలు తమ ప్రత్యేక దళాల్లో మహిళా అధికారుల నియామకానికి అనుమతించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎయిర్ ఫోర్స్ నూతన పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.

You may also like

Leave a Comment