ఎన్నికల (Elections) నేపథ్యంలో మద్యం (Liqour) ఏరులై పారే అవకాశం ఉంది. ఈ క్రమంలో అంతర్రాష్ట్ర (Inter State) సరిహద్దు (Border)ల్లో తెలంగాణ ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. తాజాగా ఆదివారం దాడులను ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
మొత్తం 14 వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఇటీవల రాష్ట్రంలో ఎన్నికల సన్నద్దతపై అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం భేటీ అయింది. రాష్ట్రంలో ధన ప్రవాహం, మద్యం పంపిణీకి అడ్డుకట్టే విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చింది.
ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు, మద్యాన్ని సరిహద్దులు దాటిస్తారని ఎన్నికల సంఘం పేర్కొంది. మద్యం అక్రమ నిల్వలు, అక్రమ విక్రయాలు, అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఎక్సైజ్ శాఖతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఈ సందర్బంగా ఎక్సైజ్ శాఖ అధికారులకు ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో తాజాగా నిజామాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో మొత్తం 14,227 లీటర్ల ఐడీ మద్యాన్ని సీజ్ చేశారు. దీంతో పాటు 1,710 కేజీల బెల్లం, 94.8 లీటర్ల మద్యం, 170 కేజీల గంజాయి, 21 వాహనాలను ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది.