Telugu News » Assembly Election : ఎన్నికల వేళ కీలక ప్రకటన చేసిన మావోయిస్టులు..!!

Assembly Election : ఎన్నికల వేళ కీలక ప్రకటన చేసిన మావోయిస్టులు..!!

ఎలక్షన్ షెడ్యూలు (Election Schedule) విడుదలైన గంటల వ్యవధిలో భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.

by Venu

తెలంగాణ (Telangana) లో ఇన్నాళ్ళూ మావోయిస్టుల సంచారం అంతగా కనబడలేదు. కానీ త్వరలో ఎన్నికలు ఉన్న నేపధ్యంలో మావోయిస్టులు (maoist) తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజలను చైతన్యపరిచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎలక్షన్ షెడ్యూలు (Election Schedule) విడుదలైన గంటల వ్యవధిలో భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.

బీజేపీ (BJP) ని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలను తరిమేయాలని, కాంగ్రెస్ (congress) సహా ప్రతిపక్ష పార్టీలను నిలదీయాలని కోరింది. అధికారం కోసం అర్రులు చాస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ (BRS) పార్టీల మధ్య అంతర్గత పొత్తు ఉందని విమర్శించింది. అధికారం కోల్పోయి నిరాశాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో ఇచ్చే పథకాలపై నిలదీయాలని కోరింది.

బీఆర్ఎస్ ప్రభుత్వం తమ పదేళ్ళ పాలనలో ప్రజలకు ఓరగ పెట్టింది ఏం లేదు. ప్రజలను మోసగిస్తూ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తు మూడోసారి పవర్‌లోకి రావడానికి మాయమాటలు చెబుతుందని అన్నారు. గతంలో ఇచ్చిన అనేక వాగ్ధానాలు అమలు చేయని ప్రభుత్వం.. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడల్లా రైతుబంధు, దళితబంధు, బీసీ బంధు, గిరిజనబంధు లాంటి గారడీ మాటలతో ప్రజలను ప్రలోభాలకు గుర్తుచేసిందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే అని అన్నారు. ఇంకా ఎన్నో ప్రభుత్వ వైఫ్యల్యాలను వేలెత్తి చూపారు. సంక్షేమ పథకాల పేరుతో కేసీఆర్ బంధుమిత్రులే లబ్దిదారులై వాటాలు పంచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. మిగులులో ఉన్న తెలంగాణను అప్పులపాలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లుతుందని తెలిపారు. రైతు ప్రభుత్వం అంటూనే రైతులను దగా చేసిన ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

You may also like

Leave a Comment