Telugu News » Sneha Reddy : అభిమానులకు షాకిచ్చిన బన్నీ భార్య..!!

Sneha Reddy : అభిమానులకు షాకిచ్చిన బన్నీ భార్య..!!

స్నేహ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ప్రేమలో ఉన్నా.. లేకపోయినా నేను శాంపైన్ తాగుతాను అంటూ కొటేషన్ ఉన్న కార్డుని షేర్ చేసింది. ఈ పోస్ట్ తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

by Venu

సెలబ్రిటీల (Celebrity) పర్సనల్ విషయాలంటే అభిమానులకు ఉన్న ఇంట్రస్ట్ అంతా ఇంతా కాదు. వీరికి సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణంగా తెలుసుకోవడాని ఎంత సమయం అయినా స్పెండ్ చేస్తారు. తమ ఫేవరెట్ హీరోతో సమానంగా వారి ఫ్యామిలీపైన కూడా ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. ముఖ్యంగా హీరో (HERO) ఫ్యామిలీ మెంబర్స్ కి సంబందించిన సోషల్ మీడియా అకౌంట్‌లని వెతికి మరీ వాళ్ళని ఫాలో అవుతారు.

అల్లు అర్జున్ (Allu Arjun) భార్య స్నేహా రెడ్డి (Sneha Reddy) సోషల్ మీడియా (Social media) లో విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నవారిలో ఒకరు. ఈమె ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పోస్టులకు చాలా మంది అభిమానులు ఉన్నారు. స్నేహా రెడ్డి నిత్యం సోషల్ మీడియా వేదికగా చాలా స్టైలిష్ లుక్‌లో ఫోటోలను, తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అల్లు అర్జున్, అర్హ, అయాన్‌ల గురించి అప్డేట్లను అభిమానులకు అందిస్తుంటుంది.

అయితే స్నేహ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ప్రేమలో ఉన్నా.. లేకపోయినా నేను శాంపైన్ తాగుతాను అంటూ కొటేషన్ ఉన్న కార్డుని షేర్ చేసింది. ఈ పోస్ట్ తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, స్నేహారెడ్డి షాంపైన్ తాగుతానని చెప్పకనే చెప్పేసిందా.. అంటూ ఆలోచనలో పడ్డారు. మరికొంత మంది మాత్రం బన్నీ అంటే స్నేహారెడ్డికి ఎంత ప్రేమో.. తాను షూటింగ్ లో ఉన్నప్పుడు మిస్ అవుతున్నానని చెప్పడానికి ఈ పోస్ట్ అంటూ సమాధానం చెప్పుకొంటున్నారు..

You may also like

Leave a Comment