పలు సంస్థల పై ఐటీ (IT) దాడులు సంచలనం సృష్టిస్తుండగా తాజాగా.. రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమా నిర్మాత అభిషేక్ ఆఫీస్‌లో ఐటీ దాడులు టాలీవుడ్ (Tollywood) పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఈ నిర్మాత తన రాబోయే చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు మీడియా ఏర్పాట్లకు సిద్ధమవుతున్నతరుణంలో ఐటీ దాడులు జరగడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
కాగా టైగర్ నాగేశ్వరరావు మూవీ కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడంతోనే ఐటి అధికారులు సోదా చేసినట్లు తెలుస్తోంది. పైగా ఈ నిర్మాణ సంస్థ నుంచి అన్ని చిత్రాలు కూడా పాన్ ఇండియా లెవెల్లోనే అనౌన్స్ చేస్తుండడంతో గతంలో వచ్చిన కశ్మీర్ ఫైల్స్ వసూళ్లు.. వాటి జీఎస్టీ తాలూకా వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో అనే నేపథ్యంలో ఐటీ రైడ్ చేసి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు.
మరోవైపు మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)ను హైదరాబాద్‌లో అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) కలుసుకున్నారు. అమిత్ షాను కలిసి 24 గంటలు అవక ముందే అభిషేక్ అగర్వాల్ నివాసం, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరగడం గమనార్హం. ఈ దాడుల్లో బెంగళూరు బృందంతో కలిసి రాష్ట్ర ఐటీ అధికారులు పాల్గొన్నట్టు సమాచారం..