సిల్క్ స్కామ్ (Silk scam) కేసులో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (ChandraBabu) అరెస్టు తర్వాత లోకేష్ (Lokesh) పాదాలకు విరామం లేకుండా అయ్యింది. ఒకవైపు పార్టీ బాధ్యతలు మరో వైపు తండ్రి అరెస్ట్ విషయంలో పెద్దలతో భేటీలు.. ఈ నేపధ్యంలో వారం క్రితం ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Sha) అపాయింట్ మెంట్ కోసం లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ వచ్చిన వార్తలను తిరస్కరించారు. కానీ నేడు ఆ వార్తలే నిజం అయ్యాయి.
రెండో రోజు సీఐడీ విచారణకు హజరైన లోకేష్ అనంతరం ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాని ఢిల్లీలో కలిశారు. అమిత్ షా నివాసంలో జరిగిన భేటీలో చంద్రబాబు అరెస్టు, సీఐడీ కేసుల నమోదు విషయాలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, తనను విచారణ పేరుతో వేధించడమే కాకుండా తన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రహ్మణిని కుడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నారా లోకేష్ అమిత్ షా కి తెలిపారు.
జగన్ సర్కార్ పెట్టిన కేసులు, ట్రైల్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసుల విషయాలను, వాటి విచారణ గురించి కూడా కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు లోకేష్. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉంటే అమిత్ షా, లోకేష్ కి అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారని ఈ సందర్భంగా పురందేశ్వరి ప్రశ్నించారు .