Telugu News » Dasara Holidays : విద్యార్థులకు తీపికబురు చెప్పిన విద్యాశాఖ ..

Dasara Holidays : విద్యార్థులకు తీపికబురు చెప్పిన విద్యాశాఖ ..

జూనియర్ కాలేజీలకు ఈ నెల19వ తేదీ నుంచి దసరాలు సెలవు ప్రారంభం కాగా, 26వ తేదీ వరకు సెలవులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ముందుగా 24, 25 తేదీలలో దసరా సెలవు ప్రకటించగా.. రెండు రోజుల క్రితం తన నిర్ణయాన్ని మార్చుకోంది.

by Venu

నిన్న మొన్నటి వరకి చదువులు, పరీక్షలు అంటూ తీరిక లేకుండా గడిపిన విద్యార్థులకు (Students) విద్యాశాఖ (Education Department) తీపికబురు చెప్పింది. తెలంగాణ (Telanga)లో అన్ని ప్రభుత్వ, ప్రవేట్ స్కూల్స్‌కి ఈ నెల 13వ తేదీ నుంచి దసరా ((Dasara)సెలవులు (Holidays) ప్రకటించింది. 26వ తేదీన స్కూల్స్ తిరిగి ఓపెన్ అవుతాయని తెలిపింది.

మరో వైపు ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఆ పరీక్షల ఫలితాలు సెలవుల అనంతరం వెల్లడిస్తారు. కాగా ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌-1, 2 పరీక్షల మార్కులను గురువారం లోపు చైల్డ్‌ ఇన్ఫోలో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

జూనియర్ కాలేజీలకు ఈ నెల19వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కాగా, 26వ తేదీ వరకు సెలవులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ముందుగా 24, 25 తేదీలలో దసరా సెలవులు ప్రకటించగా.. రెండు రోజుల క్రితం తన నిర్ణయాన్ని మార్చుకోంది. దసరా సెలవును 23, 24కి మార్చేసింది. ఈ ఏడాది అధిక మాసం కారణంగా దసరా పండుగ విషయంలో నెలకొన్న కన్‌ఫ్యూజన్ వల్ల సెలవులో మార్పులు చేసింది.

ఇక ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బతుకమ్మని ప్రభుత్వ పండుగగా గుర్తించిన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభత్వం. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు సాగుతాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.

You may also like

Leave a Comment