Telugu News » Hyderabad : హైదరాబాద్ కొత్త సీపీ.. ఈయనే!

Hyderabad : హైదరాబాద్ కొత్త సీపీ.. ఈయనే!

బదిలీ అయినవారి స్థానంలో ఇంచార్జిలను నియమిస్తూ డీజీపీ అంజనీ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ సీపీగా విక్రమ్‌ సింగ్‌ మాన్‌ ను నియమించారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో సీవీ ఆనంద్ ఉన్నారు.

by admin
Vikram Singh Mann To Take Charge As Hyderabad CP

ఇంకొద్ది రోజుల్లో తెలంగాణ (Telangana) లో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) ల బదిలీలు చేపట్టింది. ఈ క్రమంలోనే ముగ్గురు పోలీస్ కమిషనర్లు, 10 మంది జిల్లా ఎస్పీ‌లతో పాటు ఐఏఎస్, సీనియర్ అధికారులను బదిలీ చేసింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని, వారి నియామకం కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పన అధికారుల పేర్లతో అవసరమైన జాబితాను అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Vikram Singh Mann To Take Charge As Hyderabad CP

బదిలీ అయినవారి స్థానంలో ఇంచార్జిలను నియమిస్తూ డీజీపీ అంజనీ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ సీపీగా విక్రమ్‌ సింగ్‌ మాన్‌ ను నియమించారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో సీవీ ఆనంద్ ఉన్నారు. వరంగల్‌ సీపీగా మురళీధర్‌, నిజామాబాద్‌ సీపీగా జయరాంను నియమించారు. మహబూబ్‌ నగర్‌ ఎస్పీగా అందె రాములు, నాగర్‌ కర్నూల్‌ ఎస్పీగా రామేశ్వర్‌, గద్వాల ఎస్పీగా ఎన్‌ వి, సూర్యాపేట ఎస్పీగా నాగేశ్వర్‌ రావు, సంగారెడ్డి ఎస్పీగా అశోక్‌, కామారెడ్డి ఎస్పీగా నరసింహారెడ్డి, జగిత్యాల ఎస్పీగా ప్రభాకర్‌రావు, మహబూబాబాద్‌ ఎస్పీగా చెన్నయ్య, నారాయణ్‌ పేట ఎస్పీగా సత్యనారాయణ, భూపాలపల్లి ఎస్పీగా రాములును నియమించారు.

ఎన్నికల సమయంలో సీనియర్ అధికారుల బదిలీపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే వివాదాలు తెరపైకి వస్తున్నాయి. అందుకే వారిని మార్చి ఉంటారని అంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ ఇంచార్జిగా ఉన్న సీవీ ఆనంద్ పై అనేక విమర్శలు వచ్చాయి. బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వడం, దీని వెనుక ప్రభుత్వ ఒత్తిడి ఉండడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు వేటు పడిందని అనుకుంటున్నారు. అలాగే, టెన్త్ పరీక్షా పత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్‌ ను అనుమానితుడిగా చేర్చడంతో వరంగల్ సీపీ రంగనాథ్ రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువు అయ్యారు. దాని ఫలితమే ఇప్పుడు బదిలీ వేటు పడేలా చేసిందనే టాక్ వినిపిస్తోంది.

ఇక, కరీంనగర్ సీపీగా ఉన్నప్పుడు సత్యనారాయణపై అనేక ఫిర్యాదులు అందాయి. బండి సంజయ్ నిరసన దీక్షను భగ్నం చేసే సమయంలో తలుపులు పగుల గొట్టి ఎంపీని అదుపులోకి తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇదే క్రమంలో అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కొందర్ని సెలెక్ట్ చేసి బదిలీ వేటు వేసిందనే చర్చ జరుగుతోంది.

You may also like

Leave a Comment