Telugu News » MP Arvind : రాష్ట్రంలో హంగ్ వస్తే ఫస్ట్ జంప్ అయ్యేది వాళ్ళు.. ఎంపీ అరవింద్..!!

MP Arvind : రాష్ట్రంలో హంగ్ వస్తే ఫస్ట్ జంప్ అయ్యేది వాళ్ళు.. ఎంపీ అరవింద్..!!

రామ రాజ్యం వస్తే సమస్యలన్ని పోతాయన్నారు. వాస్తవానికి పసుపు సనాతన ధర్మం.. పసుపు బోర్డు నా రాజకీయ పునాది అని అరవింద్ తెలిపారు. బీఅర్ఎస్ కు ఓటు వేస్తే దానంత పాపం మరొకటి లేదు.. మన బిడ్డల జీవితాలను తాకట్టు పెట్టినట్టే అని ఎంపీ అర్వింద్ విమర్శించారు.

by Venu

ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) పసుపు బోర్డ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పసుపు రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ కల నెరవేరిందనే సంతోషంలో మునిగి పోయారు. మరోవైపు జగిత్యాల (Jagityala) జిల్లా మెట్పల్లి (Metpalli) పసుపు రైతులు కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభకు నిజామాబాద్ (Nizamabad) ఎంపీ (MP) ధర్మపురి అరవింద్ (Arvind) ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఅర్ఎస్ పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ దళారి వ్యవస్థను పెంచిందని అన్న ఆయన కాంగ్రెసోడు సచ్చిపోయిన పీనుగులాంటోడని వ్యంగ్యాస్త్రాలు వదిలారు. ఈ విషయంలో నా తండ్రైన, జీవన్ రెడ్డి అయినా ఒక్కటేనని అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కబ్జాలు చేయనని, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇయ్యనని, నాలుగు పైసల అవినీతి కూడా తన మీద లేదని, ఉండదని వెల్లడించారు.

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మూడు సార్లు గెలిచిన అవినీతి పరుడు.. ఎస్ ఐ ని ట్రాన్స్ఫర్ చేయిస్తే పది లక్షలు.. సిఐని ట్రాన్స్ ఫర్ చేయిస్తే ఇరవై ఐదు లక్షలు తీసుకుంటాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ రాజ్యం వస్తే సమస్యలన్ని పోతాయన్నారు. వాస్తవానికి పసుపు సనాతన ధర్మం.. పసుపు బోర్డు నా రాజకీయ పునాది అని అరవింద్ తెలిపారు. బీఅర్ఎస్ కు ఓటు వేస్తే దానంత పాపం మరొకటి లేదు.. మన బిడ్డల జీవితాలను తాకట్టు పెట్టినట్టే అని ఎంపీ అర్వింద్ విమర్శించారు.

రాష్ట్రంలో హంగ్ వస్తే ఫస్ట్ జంప్ అయ్యేది రేవంత్ రెడ్డి అని ఎంపీ వ్యాఖ్యానించారు. నవంబర్ 30న తెలంగాణకు పట్టిన బీఅర్ఎస్ పీడ వదులుతోందని, ఇందూరు పార్లమెంట్ లోని 7 అసెంబ్లీ స్థానాల్లో బిజేపి గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీతో చెరుకు పంటకు పునర్ వైభవం తీసుకొస్తానని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని వదిలి పెట్టేది లేదని ఎంపీ అర్వింద్ హెచ్చరించారు.

You may also like

Leave a Comment