Telugu News » Kishan Reddy : కేసీఆర్ కు ఓట్ల పైన ఉన్న ధ్యాస రాష్ట్ర అభివృద్ధిపై లేదు…..!

Kishan Reddy : కేసీఆర్ కు ఓట్ల పైన ఉన్న ధ్యాస రాష్ట్ర అభివృద్ధిపై లేదు…..!

ఇంజనీర్లందరినీ పక్కన పెట్టి ఫాంహౌస్ ఇంజనీర్‌గా మారి తెలంగాణ ప్రాజెక్ట్ లను సీఎం కేసీఆర్ ముంచుతున్నాడంటూ మండిపడ్డారు.

by Ramu

సీఎం కేసీఆర్‌ (CM KCR)కు ఓట్ల పైన ధ్యాస తప్ప తెలంగాణ అభివృద్ది పై ఆయనకు ఏ మాత్రమూ చితశుద్ది లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మండిపడ్డారు. కేసీఆర్ ను సీఎం చేయాలని, ఆయన జాతీయ నేత కావాలని శ్రద్ద తప్ప కేసీఆర్ కు తెలంగాణ ప్రజల గురించి ఏ మాత్రం పట్టింపులేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ కాదన్నారు. దాన్ని మెయింటేన్ చేయలేమని ఇంజనీర్లు అంటున్నారని చెప్పారు. ఇంజనీర్లందరినీ పక్కన పెట్టి ఫాంహౌస్ ఇంజనీర్‌గా మారి తెలంగాణ ప్రాజెక్ట్ లను సీఎం కేసీఆర్ ముంచుతున్నాడంటూ మండిపడ్డారు.

తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారని విమర్శించారు. వ్యవస్థ మొత్తాన్ని సీఎం కేసీఆర్ చిన్నా భిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అప్పు ఇచ్చింది కేంద్రమేనన్నారు. 7 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిందన్నారు. కేంద్రం చిత్తశుద్దితో రాష్ట్రానికి సహకారం చేస్తుంటే వీళ్ళ దోపిడీ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

మోడీ సర్కార్ రాకముందు దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉండేదన్నారు. ఇప్పుడు దేశంలో వ్యవసాయ రంగానికి ఎక్కడా విద్యుత్ కోతలు లేవన్నారు. రామగుండం ఎన్టీపీసీకి మోడీనే శంఖుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎరువుల సమస్యను ప్రధాని మోడీ తీర్చారని అన్నారు. 10 ఎకరాలు ఉన్న రైతులకు ఎరువుల మీద రూ. 2 లక్షల సబ్సిడీని కేంద్రం ఇస్తోందన్నారు. ఎరువుల పరిశ్రమ, ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ప్రారంభానికి ప్రధాని వస్తే ఫాంహౌస్, ప్రగతి భవన్ లో కేసీఆర్ పడుకున్నాడంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

కృష్ణా ట్రిబ్యునల్ ఆలస్యానికి కేసీఆర్ కారణమన్నారు. తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే నదుల అనుసంధానం జరగాలన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయంటూ ఆరోపించారు. కృష్ణా జలాల్లో 299 టీఎంపీలకు సీఎం కేసీఆర్ సంతకం పెట్టాడా లేదా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. కృష్ణా జలాల కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేశామన్నారు. దానికి కనీసం థాంక్స్ కూడా చెప్పనీ పెద్ద మూర్ఖుడు కేసీఆర్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా ట్రిబ్యునల్ ను కేంద్రం ఏర్పాటు చేయటంతో తన బండారం బయట పడుతుందని సీఎం కేసీఆర్ భయపడుతున్నాడని చెప్పారు.

నోరు తెరిస్తే చాలు కేసీఆర్ అన్నీ అబద్దాలే చెబుతారని బండి సంజయ్ అన్నారు. మోటార్లకు కేంద్రం మీటర్లు ఎక్కడ పెట్టిందో బీఆర్ఎస్ నేతలు చూపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాటలను విశ్వసించి రైతులు మరోసారి మోసపోవద్దన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక రైతు బంధును బంద్ చేస్తారని ఆరోపించారు. రామగుండంలో ప్రధాని మోడీ వాస్తవాలు చెప్పడంతో సింగరేణి ప్రైవేటీకరణపై కేసీఆర్ వెనక్కి తగ్గారని అన్నారు. ఏపీ సీఎం జగన్ తో కుమ్మకై కేసీఆర్ దక్షిణ తెలంగాణకు ద్రోహం చేశాడని ఆరోపణలు చేశారు. దక్షిణ తెలంగాణ రైతాంగాన్ని కేసీఆర్ నట్టేట ముంచాడన్నారు. ఉచిత యూరియా హామీ ఎటు పోయిందో కేసీఆర్ చెప్పాలన్నారు. తెలంగాణ రైతులకు న్యాయం చేసింది కేంద్రమేనన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రైతులు బీజేపీకి ఓటు వేసి మోడీకి గిఫ్ట్ ఇవ్వాలని కోరారు.

 

You may also like

Leave a Comment