Telugu News » Siddipet : బతుకమ్మ నాడే.. తెల్లారిన బతుకులు..!

Siddipet : బతుకమ్మ నాడే.. తెల్లారిన బతుకులు..!

జగదేవ్ పూర్ (Jagadevpur) మండలం తీగుల్ (Tigul) గ్రామం ఊరి చెరువులో వ్యర్థ పదార్థాలు, చెత్తను తొలగించేందుకు దిగి ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు గల్లంతు అయ్యారు.

by Venu

సంవత్సరానికి ఒక్క సారి వచ్చే బతుకమ్మ (Bathukamma) పండగ (Celebrations) ప్రతి గడపలో ఆనందాన్ని నింపుతోంది. కానీ ముగ్గురి కుటుంబాల్లో మాత్రం చీకటిని నింపింది. సిద్దిపేట (Siddipet) జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన గురించిన వివరాలు తెలుసుకొంటే..

జగదేవ్ పూర్ (Jagadevpur) మండలం తీగుల్ (Tigul) గ్రామం ఊరి చెరువులో వ్యర్థ పదార్థాలు, చెత్తను తొలగించేందుకు దిగి ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు గల్లంతు అయ్యారు. కాగా 9 తొమ్మిది రోజుల పాటు ఆడిన బతుకమ్మను చెరువులో వేయడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఏ రోజుకారోజు చెరువులోని వ్యర్థ పదార్థాలు శుభ్ర పరిచే క్రమంలో.. బాబు, భారతి, యాదమ్మ చెరువులోకి దిగి గల్లంతు అయ్యారు.

ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించారు. వారు వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని, స్థానికుల సాయంతో ఇద్దరి మృతదేహాలను బయటికి తీశారు. వారు బాబు, భారతిగా గుర్తించారు. కొంత సమయం తర్వాత యాదమ్మ మృతదేహం కూడా లభ్యమైంది. మరోవైపు ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.

బాబు, భారతి, యాదమ్మ మరణ వార్త తీగుల్ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. ముగ్గురు కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించేందుకు పోలీసుల ప్రయత్నించగా, మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. మరణించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.

You may also like

Leave a Comment