Telugu News » Batukamma : అటుకుల బతుకమ్మ.. ఎందుకు జరుపుకొంటారంటే!!

Batukamma : అటుకుల బతుకమ్మ.. ఎందుకు జరుపుకొంటారంటే!!

రెండవ రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ (Atukula Batukamma) అంటారు. అటుకుల బతుకమ్మ రోజు దేవి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆ రోజు అమ్మవారికి అటుకులు బెల్లం నైవేద్యంగా పెడతారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మకు నైవేద్యంగా సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు సమర్పిస్తారు.

by Venu
bathukamma

బతుకమ్మ (Batukamma) పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణ (Telangana) ఆడపిల్లలు కోలాహలంగా కనిపిస్తారు. రకరకాల పువ్వులతో బతుకమ్మను అలంకరించి ఉత్సాహంగా ఊరువాడ అంతా ఒక్కటై, బతుకమ్మ పండుగను (Festival) ఘనంగా జరుపుకుంటారు. ఇలా తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ముందుగా మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.

కాగా తొలిరోజు ఎంగిలి బతుకమ్మలో భాగంగా మహిళలు బతుకమ్మలను పేర్చి సమీపంలో ఉన్న ఆలయాల వద్ద, చెరువుల వద్ద పెట్టి సంబరాలు జరుపుకొంటారు. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా అమ్మవారికి నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రసాదం తయారు తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు. మహిళలు అందరూ లక్ష్మీదేవుల్లా ముస్తాబై తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పాటలను పాడుతూ సంతోషంగా గడుపుతారు.

రెండవ రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ (Atukula Batukamma) అంటారు. అటుకుల బతుకమ్మ రోజు దేవి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆ రోజు అమ్మవారికి అటుకులు బెల్లం నైవేద్యంగా పెడతారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మకు నైవేద్యంగా సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు సమర్పిస్తారు. మరోవైపు అటుకులను వాయనంగా అందించుకొంటారు. ఇలా తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకలలో రోజుకొక రకమైన నైవేద్యాన్ని తయారుచేసి అమ్మవారికి నివేదించి ఆటలు ఆడతారు.

పేద ధనిక తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరు బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. కాగా ప్రకృతితో పెనవేసుకున్న పూల పండుగ బతుకమ్మ.. ఈ పండుగను తొమ్మిది రోజులపాటు చాలా ఘనంగా వాడవాడలా నిర్వహిస్తారు. మహిళలంతా గౌరీదేవిని తొమ్మిది రోజులపాటు పూజించి అందరూ సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలతో విలసిల్లాలని కోరుకుంటారు. ఇక తెలంగాణాకే ప్రత్యేకమై.. విశ్వ ఖ్యాతిని ఆర్జించిన బతుకమ్మ పండుగ.. బతుకును గుర్తు చేసే పండుగ. తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ.

You may also like

Leave a Comment