Telugu News » Husnabad : హుస్నాబాద్ లో ఎన్నికల శంఖారావం పూరించిన కేసీఆర్..

Husnabad : హుస్నాబాద్ లో ఎన్నికల శంఖారావం పూరించిన కేసీఆర్..

రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు, తాగునీరు తెచ్చుకున్నామని కేసీఆర్ తెలిపారు.. హుస్నాబాద్‌ నియోజకవర్గానికి ఆరు నెలల్లో లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయని పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికలు పూర్తయిన 6 నెలల్లో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

by Venu

గులాబీ బాస్ కేసీఆర్ ఇవాళ్టి నుంచే ఎన్నికల కదనరంగంలోకి దిగారు. హుస్నాబాద్ (Husnabad) వేదికగా తలపెట్టిన బహిరంగ సభకు హాజరైన సీఎం (CM) ఎన్నికల శంఖారావం పూరించారు. అయితే హుస్నాబాద్‌ సెంటిమెంట్ గా భావించే కేసీఆర్ (KCR) మరోసారి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ ద్వారా అసెంబ్లీ ఎన్నికల (Assembly election) ప్రచారాన్ని (campaign) ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ పలు అంశాలపై ప్రసంగించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తెలివిగా ఆలోచించాలని సభలో కేసీఆర్ సూచించారు. ప్రజలు ఓటు హక్కు ఉపయోగించుకొనే సమయంలో స్పష్టమైన అవగాహనతో ఉండాలన్నారు.. 9 ఏళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉందని కేసీఆర్ ప్రశ్నించారు. అందరి సహకారంతో ఇవాళ రాష్ట్రాన్ని అన్ని అంశాల్లో నంబర్‌ వన్‌గా నిలిపామని పేర్కొన్నారు.

వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో మనకు ఎవరూ సాటి రారని, పోటీ లేరని తెలిపారు. కొన్ని పార్టీలు వచ్చి ఇప్పుడు మాయమాటలు చెప్తాయని.. ఒక్క అవకాశం ఇవ్వమని కాంగ్రెస్‌ పార్టీ (Congress) అడుగుతోందని కేసీఆర్ విమర్శించారు. రైతుబంధుతో రాష్ట్ర వ్యవసాయ విధానమే మారి పోయిందని.. కాంగ్రెస్‌ హయాంలో విద్యుత్‌ సరఫరా ఎలా ఉండేదో ప్రజలు గమనించాలని కేసీఆర్ వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు, తాగునీరు తెచ్చుకున్నామని కేసీఆర్ తెలిపారు.. హుస్నాబాద్‌ నియోజకవర్గానికి ఆరు నెలల్లో లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయని పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికలు పూర్తయిన 6 నెలల్లో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. శనిగరం ప్రాజెక్టుకు మరమ్మతులు పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిలో పడేసే దిశగా ముందుకు వెళ్తున్నామని కేసీఆర్ వివరించారు.

kcr speech in praja ashirvada sabha husnabad

You may also like

Leave a Comment