Telugu News » KA Paul: బీఆర్​ఎస్​ మేనిఫెస్టో అంతా బూటకం.. కేఏ పాల్..!!

KA Paul: బీఆర్​ఎస్​ మేనిఫెస్టో అంతా బూటకం.. కేఏ పాల్..!!

తెలంగాణ ప్రజలు పెట్టుకొన్న నమ్మకాన్ని ఎప్పుడో వమ్ము చేసిన కేసీఆర్.. మరోసారి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి విడుదల చేసిన మేనిఫెస్టో అంతా బూటకమని విమర్శించారు. తెలివైనవాడు ఎవడూ.. కేసీఆర్​కు ఓటెయ్యడన్నారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీ పాలనను వెలివేయాలని పిలుపునిచ్చారు.

by Venu

తెలంగాణ (Telangana) లో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని పార్టీలు ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నాయి. కాగా నేడు బీఆర్ఎస్ (BRS) పార్టీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం (CM) కేసీఆర్ (KCR) విడుదల చేసిన మేనిఫెస్టో (Manifesto)పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) మండిపడ్డారు.

కేసీఆర్​ సర్కార్..​ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని, గత ఎన్నికలప్పుడు​ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. డబుల్​ బెడ్​రూం ఇళ్ల పంపిణీ, దళితబంధు, నిరుద్యోగులకు ఉద్యోగాల హామీని నేరవేర్చలేదని పాల్ ధ్వజమెత్తారు. కేసీఆర్​ మోసపూరిత వాగ్దానాలను చేస్తూ ప్రజల ఓట్లు కొల్లగొడుతున్నారని విమర్శించారు.

తెలంగాణ ప్రజలు పెట్టుకొన్న నమ్మకాన్ని ఎప్పుడో వమ్ము చేసిన కేసీఆర్.. మరోసారి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి విడుదల చేసిన మేనిఫెస్టో అంతా బూటకమని విమర్శించారు. తెలివైనవాడు ఎవడూ.. కేసీఆర్​కు ఓటెయ్యడన్నారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీ పాలనను వెలివేయాలని పిలుపునిచ్చారు.

మరో వైపు ప్రధాన పార్టీలపై కూడా కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కాంగ్రెస్​ పార్టీ కూడా ఆచరణ సాధ్యం కానీ.. హామీలను ఇచ్చి చేతులు ఎత్తేసిందని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ ఓ మతతత్వ పార్టీ అని ఆరోపించారు. బడుగ వర్గాల వారికే ప్రజాశాంతి పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని.. బలహీన వర్గాల వారికి ఉపయోగపడే విధంగా మేనిఫెస్టో రూపొందించినట్లు పాల్ పేర్కొన్నారు.

You may also like

Leave a Comment