Telugu News » Pragnanandhaa: చెస్ గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానందకు ఇస్రో చైర్మన్‌ ప్రశంసలు!

Pragnanandhaa: చెస్ గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానందకు ఇస్రో చైర్మన్‌ ప్రశంసలు!

ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ సోమవారం ఉదయం వెళ్లి ప్రజ్ఞానందకు రాకెట్‌ను నమూనాను బహూకరించారు.

by Mano
ISRO Chairman Somanath | ISRO Chairman Indian Chess Grandmaster Ramesh Babu congratulated Indian Grandmaster Pragyananda

ఇండియన్‌ చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ రమేశ్‌బాబు ప్రజ్ఞానందను(Praggnanandhaa) ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌(ISRO Chairman Somanath) ప్రశంసల జల్లు కురిపించారు. చెన్నైలోని ప్రజ్ఞానంద నివాసానికి ఇస్రో చైర్మన్‌ సోమవారం ఉదయం వెళ్లి ప్రజ్ఞానందకు రాకెట్‌ను నమూనాను బహూకరించారు.

ISRO Chairman Somanath | ISRO Chairman Indian Chess Grandmaster Ramesh Babu congratulated Indian Grandmaster Pragyananda

అనంతరం ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. ప్రజ్ఞానంద సాధించిన ఘనతకు ప్రతీ భారతీయుడిలానే తానూ  గర్వపడుతున్నానని తెలిపారు. ప్రస్తుతం ప్రజ్ఞానంద ప్రపంచంలోనే 15వ ర్యాంకులో ఉన్నాడని, త్వరలోనే ప్రపంచ నంబర్ 1 అవుతాడని అన్నారు.

చెస్‌ ఆటకు మూలాలన్నీ భారత్‌లోనే ఉన్నాయని అన్నారు. భారత్‌లోనే ప్రారంభమైన పురాతన ఆట అని చెప్పారు. ఇది మనస్సు, తెలివితేటలు, ప్రణాళిక, వ్యూహంతో కూడిన ఆట అని తెలిపారు. అందుకే భారత్‌ ప్రాచుర్యం పొందిందని వెల్లడించారు. చంద్రుడిపై ప్రజ్ఞాన్ ఉండడం పట్ల గర్వపడుతున్నట్లు తెలిపారు.

You may also like

Leave a Comment