హమాస్ (Hamas) మిలిటెంట్ల దగ్గర దొరికిన బుక్ లెట్ (Booklet) ఒకటి కలకలం రేపుతోంది. ‘దా వారియర్స్ గైడ్స్- జిహాదీ వెర్షన్’అనే ఆ పుస్తకంలో వున్న విషయాలు చదువుతుంటే ఒళ్లు గగుర్లు పొడుస్తోంది. దేశంలో గందర గోళం (Chaos) ఎలా సృష్టించాలి, బంధీలను ఎలా క్రూరంగా హింసించాలి, వారికి విద్యుత్ షాక్ లు, బహిరంగ శిక్షలు లాంటి పలు అంశాల గురించి ఈ పుస్తకంలో వివరించారు.
హమాస్ ఉగ్రవాదిని ఇజ్రాయెల్ సైన్యం ఇటీవల మట్టు పెట్టింది. అతని దగ్గర నుంచి ‘దా వారియర్స్ గైడ్స్-జిహాదీ వెర్షన్’ అనే పుస్తకాన్ని ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ వెల్లడించారు. ఆ బుక్ ఒక ఆపరేటింగ్ మ్యానువెల్ అని తెలిపారు. కిబ్బడ్జ్ నగరం, మోషన్ నగరాల్లోకి ఎలా ప్రవేశించాలని ఆ పుస్తకంలో రాశారని చెప్పారు.
ఆయా నగరాల్లోకి ప్రవేశించిన తర్వాత అక్కడి స్థానికులు ఎదురు పడితే హమాస్ మిలిటెంట్లు ప్రవర్తించాల్సిన తీరును అందులో వివరించారని చెప్పారు. పౌరులు కనిపించిన వెంటనే వారిని హింసించాలని పుస్తకంలో హమాస్ మిలిటెంట్లకు సూచించారని అన్నారు. పౌరులను ఎలా హింసించాలి, ఎలా కిడ్నాప్ చేయాలి అని ఆ బుక్ లెట్లో వాళ్లకు మార్గనిర్దేశనం చేశారన్నారు.
హమాస్ మిలిటెంట్లు స్నైపర్ ఫైరింగ్ ఎలా ఉపయోగించు కోవాలి, అంబుష్ దాడి, కారు బాంబులు, ఆత్మహుతి దాడుల గురించి స్పష్టంగా వివరించారని ఇజ్రాయెల్ అధ్యక్షుడు తెలిపారు. హమాస్ మిలిటెంట్ల చేతిలో బంధీగా వున్న వాళ్ల వివరాలను తీసుకోవడం, వారి దగ్గర ఉన్న ధృవ పత్రాలను తీసుకోవడం వంటి విషయాలను కూడా అందులో పేర్కొన్నారన్నారు.
దాడులు జరిగే అవకాశం ఉనప్పుడు తమ వద్ద బంధీలుగా వున్న వ్యక్తులను ఎలా రక్షణ కవచంలా వాడుకోవాలో అందులో సూచనలు చేశారన్నారు. మిలిటెంట్లలో ఎవరైనా తిరుగుబాటుకు ప్రయత్నిస్తే అవసరాన్ని బట్టి జాతి, మతం, లింగ భేదం లేకుండా బంధీలను హతమార్చాలని అందులో ఆదేశాలు వున్నాయన్నారు.
ఇది ఇజ్రాయెల్ ను ఈ ప్రపంచ పటం నుంచి తుడిచి వేయాలని ఐసిస్ ఉగ్రసంస్థకు చెందిన సిద్దాంతాలను పోలి వున్నాయని చెప్పారు. అందువల్ల హమాస్ మిలిటెంట్లను పూర్తిగా మట్టుపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కిబడ్జ్లో హమాస్ మిలిటెంట్లు సృష్టించిన మారణ హోమానికి సంబంధించిన ఫోటోలను ఆయన ఈ సందర్బంగా విడుదల చేశారు.