Telugu News » National film awards: నేడు జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానం

National film awards: నేడు జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానం

టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పటికే  అల్లు అర్జున్ ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

by Mano
National Film Awards today

నేడు 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఈ అవార్డులను అందజేయనున్నారు. టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పటికే  అల్లు అర్జున్ ఢిల్లీకి చేరుకున్నారు.

National Film Awards today

ఈ సందర్భంగా ఐ అండ్ బీ అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. 28 భాషల్లో మొత్తం 280 చలనచిత్రాలు , 23 భాషలలో 158 నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు పరిశీలనకు వచ్చినట్లు వెల్లడించారు. ఇక వీరికి స్వర్ణ కమలం, రజత కమలం కింద ప్రైజ్ మనీ ఇస్తారు. 2021కి గానూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 24న సాయంత్రం లాంఛనంగా ఢిల్లీ వేదికగా ఈ అవార్డులను ప్రకటించింది.

ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా అనేక విభాగాల్లో అవార్డు విజేతలను వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాకు అవార్డు అందుకోనున్నారు. ఆయనకు రజత్ కమలం పతకంతో పాటు రూ.50వేల నగదు అందజేయనున్నారు.

 

 

You may also like

Leave a Comment