Telugu News » BJP : బీజేపీలో కొత్త టెన్షన్.. !!

BJP : బీజేపీలో కొత్త టెన్షన్.. !!

సీనియర్ నాయకుడు మురళీధర్ రావు అధ్యక్షతన నలుగురితో కమిటీ ఏర్పాటైంది. ఫ్లెక్సీలు, పోస్టర్ల ద్వారా అధికార పార్టీ వైఫల్యాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ కమిటీని నెలకొల్పింది. సోషల్ మీడియా టాస్క్ కూడా అప్పగించింది. కానీ ఇంత వరకి ఆ దిశగా కార్యాచరణ లేదు.

by Venu

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ చావో రేవో తేల్చుకోవాలని వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నాయి. అయితే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దూకుడు చూపించిన బీజేపీ (BJP), ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఆ దూకుడు కొనసాగించ లేక పోతుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కోసం ఆగమేఘాల మీద 14 కమిటీలను ఏర్పాటు చేసినా వాటి ఫంక్షనింగ్ ఆశించనంత స్పీడ్ లేదని రాష్ట్ర పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

కాగా తీవ్ర అసంతృప్తితో ఉన్న పదిమంది సీనియర్ నేతలు పార్టీని వీడడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వచ్చిన సమయంలో, రాష్ట్ర నాయకత్వం వారిని చైర్మన్లుగా నియమిస్తూ కమిటీలను వేసింది. ఇందులో రెండు మూడు మినహా మిగిలిన కమిటీలు ఇప్పటివరకు పని మొదలు పెట్టలేదు. మరోవైపు విజయశాంతి నేతృత్వంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళనలు నిర్వహించే ఉద్దేశంతో స్టేట్ యూనిట్ ఎజిటేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్రంలో ఈ కమిటీ ఇప్పటి వరకు ఎలాంటి ఆందోళనకు ప్లానింగ్ చేయలేదు.

ఇక సీనియర్ నాయకుడు మురళీధర్ రావు అధ్యక్షతన నలుగురితో కమిటీ ఏర్పాటైంది. ఫ్లెక్సీలు, పోస్టర్ల ద్వారా అధికార పార్టీ వైఫల్యాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ కమిటీని నెలకొల్పింది. సోషల్ మీడియా టాస్క్ కూడా అప్పగించింది. కానీ ఇంత వరకి ఆ దిశగా కార్యాచరణ లేదు. మరోవైపు సాలు దొరా.. సెలవు దొరా.. డిజిటల్ డిస్‌ప్లే కూడా ఫంక్షనింగ్‌లో లేకుండా పోయింది.

సీనియర్ నాయకురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో.. పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ ఔట్‌ రీచ్ కమిటీని నెలకొల్పింది. పట్టణాల నుంచి గ్రామాల వరకు బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పలు కార్యక్రమాలు నిర్వహించాలన్న ఈ కమిటీ లక్ష్యం గాడిన పడలేదు. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయగా బీజేపీ కూడా మాజీ ఎంపీ వివేక్ అధ్యక్షతన ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో మేనిఫెస్టో తయారీ కోసం ఏర్పరచిన కమిటీ రెండు మూడు సిట్టింగ్‌లు వేసి అంశాలను క్రోఢీకరించింది.

వివిధ సెక్షన్ల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. దసరా పండుగ నాటికి మేనిఫెస్టోను రిలీజ్ చేయాలని భావిస్తున్నది. కాగా అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ అందరికంటే వెనకబడి పోవడంతో పార్టీ శ్రేణులలో ఆందోళన నెలకొన్నదని, మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ అభ్యర్థుల ప్రకటనపై జాప్యం చేయడం బీజేపీని వెనక్కు నెడుతుందని కొందరు నేతలు అభిప్రాయ పడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

You may also like

Leave a Comment