చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం కీలక ఆరోపణలు చేశారు. శ్రీకాకుళం పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేనపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ సింగిల్‌గానే సింహంలా వస్తారని టీడీపీ, జనసేన, బీజేపీలు మూకుమ్మడిగా వచ్చినా జగన్‌ను ఏం చేయలేరన్నారు.
‘చంద్రబాబును చంపితే మాకు ఏం వస్తుంది?.. ఆయన ఎక్కడ ఉన్నా ఒక్కటే.. జైలులో సదుపాయాలపై కోర్టు ద్వారా వారు ఏం కోరుకుంటున్నారో అవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.. దేశంలో నేరాళ్లకి ఎలాగో చంద్రబాబుకూ అలాగే..’ అని అన్నారు. చంద్రబాబు ఏమైనా మహాత్మాగాంధీనా లేక నెహ్రూనా? అని ఎద్దేవా చేశారు. టీడీపీ పని క్లోజ్ అయిందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నాయకులు ఎన్ని చేసినా ప్రజల్లో రెస్పాన్స్ లేదన్నారు. 16 నెలలు వైఎస్ జగన్‌ను జైలులో పెట్టారు.. కానీ కేసులో ఏం నిరూపించుకోలేకపోయారని తెలిపారు. మరోవైపు ఎంపీ స్థానంపై పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫాలో అవుతానని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీలు దమ్మున్న పార్టీలైతే 175స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.