Telugu News » కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యేది అప్పుడేనా..?

కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యేది అప్పుడేనా..?

by Sravya

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అధికార బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం మీద కన్నేసింది. ఇప్పటికే అభ్యర్థులని ప్రకటించారు. అలానే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు తాజాగా మేనిఫెస్టో ని కూడా కెసిఆర్ రిలీజ్ చేయడం జరిగింది. 2014 2018 తరహాలోనే ఈసారి కూడా సంక్షేమ ఎజెండాతో ఓట్లని కొల్లగొట్టబోతున్నారు. ఎక్కువ మందిని ప్రభావితం చేయడానికి కేసీఆర్ బీమా వంటి ఫ్లాష్ స్కీమ్ ప్రకటించారు. తాజాగా మంత్రి కేటీఆర్ ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ అని.. విపక్షాలు ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తాయో ప్రకటించాలని కాంగ్రెస్ బిజెపికి కేటీఆర్, హరీష్ రావు సవాల్ విసురుతున్నారు.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను అంటున్న కేసీఆర్ ని మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి పరిమితం చేయాలని అనుకున్నారు. జాతీయ రాజకీయాల్లో స్కోప్ లేదని కెసిఆర్ తో పాటుగా కేటీఆర్ హరీష్ రావు కి అర్థమైంది. ఈసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ చెప్పారు. నేను ముఖ్యమంత్రి కావాలంటే మోడీ పర్మిషన్ కావాలంట కదా అని కేటీఆర్ ఈ విషయంపై స్పందించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళితే ముఖ్యమంత్రి అవుతారు కదా అని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ప్రశ్నించారు.

Also read:

కేటీఆర్ తో పాటుగా టిఆర్ఎస్ లో ముఖ్యమంత్రి అయ్యే అర్హత చాలా మందికి ఉందని టిఆర్ఎస్ కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం వస్తే తప్పకుండా కెసిఆర్ వెళ్తారని కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు పార్టీ నేతలు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అదే జరుగుతుందని కేటీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని ఈజీగా పొందలేనని ఒక విధంగా చెప్తే… ఇంకో అర్థం కేసీఆర్ కేంద్ర రాజకీయాలకు వెళ్తే తాను ముఖ్యమంత్రి అవుతానని చెప్పడం ఇలా రెండు అర్థాలు ఉన్నాయి.

You may also like

Leave a Comment