Telugu News » Bathukamma Song: బతుకమ్మ పాట పడిన ఎమ్మెల్యీ కవిత!

Bathukamma Song: బతుకమ్మ పాట పడిన ఎమ్మెల్యీ కవిత!

పండుగ కోసం స్పెషల్‌గా కంపోజ్ చేసిన బతుకమ్మ వీడియో సాంగ్‌లో ఎమ్మెల్సీ కవిత తొలిసారి తన గాత్రంతో ఆకట్టుకున్నారు.

by Mano
Bathukamma Song: MML's poem of Bathukamma song!

ఎమ్మెల్సీ కవిత ఎన్నడూ లేని విధంగా తొలిసారి పాటపాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తాను పాడిన బతుకమ్మ పాటను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో ఘనంగా జురుపుకునే పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్(X) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Bathukamma Song: MML's poem of Bathukamma song!

‘మంచు మొగ్గలై మల్లె పొదల పూల ఏరుల్లో మన సందా మావయ్యా..! అవనిపై గౌరీదేవీ బతుకమ్మై వెలసిందో ఓ సందామావయ్యా..! ముసిముసి నవ్వులతో మురిసే పువ్వులు చూసి మురిసిండ్రో..’ అంటూ సాగిన బతుకమ్మ పాట యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. పండుగ కోసం స్పెషల్‌గా కంపోజ్ చేసిన బతుకమ్మ వీడియో సాంగ్‌లో ఎమ్మెల్సీ కవిత తొలిసారి తన గాత్రంతో ఆకట్టుకున్నారు.

ఎప్పటిలాగానే భారత జాగృతి ఆధ్వర్యంలో ఈసారి కూడా మొత్తం 10 పాటలతో బతుకమ్మ ఆల్బమ్ విడుదల చేశారు. తాజా వీడియోలో కవిత బతుకమ్మ పాట పాడుతూ.. బతుకమ్మ పేరుస్తూ కూడా కనిపించారు. పచ్చని తెలంగాణ పల్లెటూరులో ఈ వీడియోను చిత్రీకరించారు. తెలంగాణ సంప్రదాయ దుస్తుల్లో యువతులు, తెలంగాణ పల్లె సోయగాలు. మరోవైపు బతుకమ్మ పూలతో ఈ వీడియో ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 

You may also like

Leave a Comment