Telugu News » Hyderabad : రైఫిల్ షూటింగ్ లో సత్తా చాటిన హైదరాబాద్ అమ్మాయి!

Hyderabad : రైఫిల్ షూటింగ్ లో సత్తా చాటిన హైదరాబాద్ అమ్మాయి!

ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని సీబీఎస్‌ఈ పాఠశాలలకు చెందిన దాదాపు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

by admin
nvs-ananya-got-silver-medal-in-cbse-south-zone-rifle-shooting-competition 1

ఖేలో ఇండియా (Khelo India) తో ఎంతో మంది ప్రతిభ గల క్రీడాకారులు (Athletes) సత్తా చాటుతున్నారు. ఈమధ్యే ఆసియా గేమ్స్ లో భారత్ (Bharat) తొలిసారి వందకు పైగా పథకాలు సాధించింది. ఈ విక్టరీ ఎందరో జూనియర్ లెవెల్ క్రీడాకారులకు ఊత్సాహాన్నిచ్చింది. అదే స్ఫూర్తితో కిందిస్థాయి ఆటల్లో తామేంటో నిరూపిస్తున్నారు వారంతా. ముందు జాతీయస్థాయిలో తర్వాత అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు కష్టపడుతున్నారు.

nvs-ananya-got-silver-medal-in-cbse-south-zone-rifle-shooting-competition

తాజాగా సీబీఎస్‌ఈ (CBSE) సౌత్‌ జోన్‌ రైఫిల్‌ షూటింగ్‌ పోటీలు ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో జరిగాయి. నెక్ట్స్‌ జెన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్ లో నిర్వహించిన ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని సీబీఎస్‌ఈ పాఠశాలలకు చెందిన దాదాపు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 12 వ్యక్తిగత విభాగాలు, 12 టీం ఈవెంట్లుగా రైఫిల్‌, పిస్టల్‌ పోటీలు జరగగా పలువురు క్రీడాకారులు సత్తా చాటారు.

nvs-ananya-got-silver-medal-in-cbse-south-zone-rifle-shooting-competition 1

ముఖ్యంగా, హైదరాబాద్ (Hyderabad) కు చెందిన ఎన్‌వీఎస్‌ అనన్య (NVS Ananya) అండర్ 19 బాలికల రైఫిల్ పోటీలో అదరగొట్టింది. సిల్వర్ మెడల్ సాధించింది. నిర్వాహకులు అనన్యకు మెడల్ అందించి అభినందించారు. ఈమె సికింద్రాబాద్ లోని రామకృష్ణాపురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో చదువుతోంది.

ఈ పోటీల్లో రాణించిన వారు త్వరలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు సౌత్‌ జోన్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఇతర క్రీడాకారులకు ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ మెడల్స్ ను బహూకరించారు.

You may also like

Leave a Comment