Telugu News » Mlc kavitha: రాష్ట్రాన్ని విడగొట్టేలా రాహుల్ మాటలు: ఎమ్మెల్సీ కవిత

Mlc kavitha: రాష్ట్రాన్ని విడగొట్టేలా రాహుల్ మాటలు: ఎమ్మెల్సీ కవిత

రాహుల్ గాంధీ ములుగు సభలో ‘వారి తెలంగాణ.. వీరి తెలంగాణ..’ అంటూ రాష్ట్రాన్ని విడగొట్టేలా మాట్లాడారని ఆరోపించారు. ఈ క్రమంలోనే రూ.లక్ష కోట్లలోపు ప్రాజెక్టుల్లో.. రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమవుతుందని సూటి ప్రశ్నను సంధించారు.

by Mano
Mlc Kavitha: Rahul's words to break up the state: MLC Kavitha

ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాహుల్ మాటలు రాష్ట్రాన్ని విడగొట్టేలా ఉన్నాయని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు.

Mlc Kavitha: Rahul's words to break up the state: MLC Kavitha

రాహుల్ గాంధీ ములుగు సభలో ‘వారి తెలంగాణ.. వీరి తెలంగాణ..’ అంటూ రాష్ట్రాన్ని విడగొట్టేలా మాట్లాడారని ఆరోపించారు. ఈ క్రమంలోనే రూ.లక్ష కోట్లలోపు ప్రాజెక్టుల్లో.. రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమవుతుందని సూటి ప్రశ్నను సంధించారు. హస్తం పార్టీ మాదిరిగా కమీషన్లు తీసుకుంటే చెరువుల్లో నీరు కాకుండా రైతుల కంట కన్నీళ్లు వచ్చేవన్నారు.

కాంగ్రెస్ గెలిస్తే ధరణి, 24గంటల విద్యుత్ దూరమవుతుందని తెలిపారు. ప్రస్తుత ఎన్నికలు తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ ప్రేమికులకు మధ్య జరుగుతున్నాయని కవిత వ్యాఖ్యానించారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ అన్యాయం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘గనులను మూసేసి కార్మికులకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీనే..’ అని ధ్వజమెత్తారు.

అధికారంలోకి రాగానే ‘ధరణి’ని కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలిపేస్తామంటోందని.. ధరణిని రద్దు చేస్తే రైతుబంధు ఎలా వస్తుందని కవిత ఈ సందర్భంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే 24గంటల కరెంటు ఉండదని తెలిపారు. తెలంగాణ పథకాలను అనేక రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

 

You may also like

Leave a Comment